• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TRUCK DRIVERS ESCAPES WITH 70 LAKSHS OF GUNTUR MIRCHI TRADER SK

తెలంగాణలో గుంటూరు మిర్చి వ్యాపారికి టోకరా.. రూ.70 లక్షలు చోరీ

తెలంగాణలో గుంటూరు మిర్చి వ్యాపారికి టోకరా.. రూ.70 లక్షలు చోరీ

రాయదుర్గం ఎస్ఆర్ హిల్స్‌లో మరో భారీ చోరీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్. కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో రూ. 15 లక్షలు, బంగారం చోరీ.

అతడు కిందకు దిగిన వెంటనే.. డబ్బు సంచితో లారీ డ్రైవర్లు పరారయ్యారు. పక్కా స్కెచ్‌తో మిర్చి వ్యాపారిని బురిడీకొట్టించి.. డబ్బును కాజేశారు.

  • Share this:
    సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ జరిగింది. గుంటూరుకు చెందిన మిర్చి వ్యాపారి నుంచి రూ.70 లక్షల నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. మహారాష్ట్రంలో పంటను అమ్మి.. డబ్బుతో తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. టూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు మిర్చి వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల రెండు ట్రక్కుల్లో మిర్చి లోడును మహారాష్ట్రలోని షోలాపూర్‌‌కు తీసుకెళ్లి మార్కెట్‌లో అమ్మారు. మిర్చి అమ్మగా వచ్చిన రూ.70లక్షల నగదు తీసుకుని రెండు ట్రక్కులో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తారం వద్ద ఏడుకొండలు మూత్ర విసర్జన కోసం ఆగాడు. అతడు కిందకు దిగిన వెంటనే.. డబ్బు సంచితో లారీ డ్రైవర్లు పరారయ్యారు.

    పక్కా స్కెచ్‌తో మిర్చి వ్యాపారిని బురిడీకొట్టించి.. డబ్బును కాజేశారు డ్రైవర్లు. ఈ ఘటన‌తో షాక్ తిన్న ఏడుకొండలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ట్రక్కు డ్రైవర్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్‌ సమీపంలో ఓ ట్రక్కును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరో ట్రక్కులో పరారైనట్లు గుర్తించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ఐదు స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఐతే డ్రైవర్లు తమ సెల్‌ఫోన్లను ట్రక్కుల్లో వదిలేసి వెళ్లడంతో ..వారిని పోలీసులు ట్రాక్ చేయలేకపోతున్నారు. బాధితుడి నుంచి డ్రైవర్ల వివరాలు, ఫొటోలు సేకరించిన దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఆ లారీలు ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఉన్నాయని.. డ్రైవర్లు యూపీకి చెందిన వారని గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వ్యాపారికి ధైర్యం చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published: