టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వలోని సిట్ బృందం తాజాగా మరో ఇద్దరికీ నోటీసులు ఇచ్చినరట్లు తెలుస్తుంది. వారిలో ఒకరు ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నందకుమార్ భార్య కాగా మరొకరు అంబర్ పేటకు చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్ గా తెలుస్తుంది. వీరికి CRPC 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. బుధవారం (నేడు) ఈ ఇద్దరు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
ఆ ముగ్గురు గైర్హాజరు..
ఇక ఈ కేసులో ఇప్పటికే నోటీసులు ఇచ్చినా కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, కేరళకు చెందిన జగ్గూజి, తుషార్ లు విచారణకు హాజరు కాలేదు. కనీసం నోటీసులపై వారు స్పందించలేదు. ఇక ఈ కేసులో ఆ నలుగురికి ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్ పై సిట్ అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని అందులో పేర్కొన్నారు. అయినా కానీ ఆ నోటీసులతో తమకేం సంబంధం లేదన్నట్టు ఆ ముగ్గురు విచారణకు హాజరు కాకపోగా నోటీసులపై కూడా స్పందించలేదు. బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ఈనెల 21,22న హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ లో విచారణకు హాజరయ్యారు. అయితే Bl సంతోష్ గుజరాత్ ప్రచారంలో ఉండడంతో విచారణకు హాజరు కాలేదని సిట్ కు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. ఇక తుషార్, జగ్గుజి మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో సిట్ అధికారులు వారిద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
లుక్ అవుట్ నోటీసులు అంటే ఏమిటి?
కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాలేదు. పరారీలో ఉన్నారు. కేసును నుండి తప్పించుకోడానికి వారు దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అందుకోసం అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేస్తూ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభారతీ, నందకుమార్, సింహయాజిలు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నిందితుల్లో ఒకరైన తిరుపతికి చెందిన సింహయాజి అనే స్వామీజీకి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడనే అనుమానాలు వచ్చాయి. ఈ కారణంగానే అతనికి నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే విచారణకు వచ్చిన శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయడంపై వివరణ ఇచ్చారు. తన ఇంట్లో పూజ చేయించుకోవాలని అనుకున్నాను. అందుకోసమే టికెట్ బుక్ చేశానని అధికారులకు చేప్పాడు. ఇక నేడు ఈ కేసుపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Hyderabad, Telangana, Trs, TRS MLAs Poaching Case