Home /News /crime /

TRS MLA VANAMA VENKATESHWARA RAO SON RAGHAVA HAS BEEN ARRESTED BY THE POLICE IN CONNECTION WITH THE SUICIDE OF PALVANCHA RAMAKRISHNA FAMILY PRV

Palvancha Ramakrishna family suicide: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వనమా కుమారుడు అరెస్టు.. పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పోలీసుల చర్యలు

vanama raghava

vanama raghava

ఈ నెల 3 వ తేదీన పాల్వంచలో Ramakrishna కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్యకు వనమా రాఘవేందర్ రావు కారణమని వెల్లడించే ఓ సూసైడ్​ నోట్​ మృతుడి కారులో లభించింది.. ఆ తర్వాత selfie వీడియోను తీశాడు. దీంతో టీఆర్​ఎస్​ ఘటనను సీరియస్​గా తీసుకుంది.

ఇంకా చదవండి ...
టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్ రావు (Raghava)ని పోలీసులు గురువారం హైదరాబాద్​లో అరెస్టు (Arrest) చేశారు. పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ నిందితుడిగా ఉన్నారు. అయితే అధికార పార్టీ నేత కొడుకు కావడంతో అటు ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి. దీంతో టీఆర్​ఎస్ (TRS)​ ఘటనను సీరియస్​గా తీసుకుంది. సరిదిద్దుకోవాల్సిందిగా ఎమ్మెల్యే వనమాకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వనమా బహిరంగ లేఖ (Open Letter) రాశారు. కుమారుడిని విచారణకు సహకరించేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సూచన మేరకు పోలీసులకు రాఘవ లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడాలని రాఘవ అనుకున్నా కుదరలేదు. పోలీసులు అరెస్టు  (Police arrested)చేశారు.

ఆత్మహత్యకు రాఘవ కారణమని..

ఈ నెల 3 వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం (Palvancha Ramakrishna family) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. . రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. ముగ్గురు సంఘటన స్థలంలోనే చనిపోగా రెండు రోజుల చికిత్స అనంతరం సాహిత్య ప్రాణాలు విడిచింది. కాగా, తన ఆత్మహత్యకు వనమా రాఘవేందర్ రావు కారణమని వెల్లడించే ఓ సూసైడ్​ నోట్ (Suicide note)​ మృతుడి కారులో లభించింది.. ఆ తర్వాత selfie వీడియోను తీశాడు.

ప్రెస్​ క్లబ్​కు వెళుతుండగా..

అయితే రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు (Police Arrested) వెల్లడించారు. అనంతరం రాఘవను కొత్తగూడేనికి తరలిస్తున్నారు. హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వెళుతుండాగా రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనమా వెంకటేశ్వరరావు సూచనలతో పోలీసులు వనమా రాఘవను హైదరాబాద్‌లోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం (Palvancha Ramakrishna family) ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ రావుపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ (Open letter) రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని వెంకటేశ్వరావు లేఖలో తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత (responsbility) తీసుకుంటానని చెప్పారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతానని వనమా చెప్పారు.

పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గ పనులకు దూరంగా..

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం (Ramakrishna family commits suicide) తనకు బాధగా ఉందని వనమా ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం, న్యాయంపై నమ్మకం ఉందని చెప్పారు వనమా. దర్యాప్తునకు అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు. తన కొడుకునూ ఇన్వెస్టిగేషన్‌ (Investigation)కు సహకరించేలా బాధ్యత తీసుకుంటానన్నారు. కేసులో నిజా నిజాలు తేలేదాకా కొడుకు రాఘవేందర్ రావును పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గ పనులకు దూరంగా ఉంచుతానని హామీ ఇచ్చారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Crime news, Khammam, Trs, Vanama

తదుపరి వార్తలు