కారు ఢీకొట్టి వ్యక్తి మృతి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పరార్

కారు ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ సీటులో ఎవరున్నారనే విషయం తెలియరాలేదు. డ్రైవర్ ఉన్నాడా? లేకపోతే ఎమ్మెల్యే సొంతంగా డ్రైవ్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది.

news18-telugu
Updated: September 15, 2019, 10:40 PM IST
కారు ఢీకొట్టి వ్యక్తి మృతి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పరార్
జైపాల్ యాదవ్ కారు ఢీకొని వ్యక్తి మృతి
  • Share this:
కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ శ్రీశైలం జాతీయ రహదారిపై బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో కల్వకుర్తి శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని భాష్యం స్కూల్ లో పని చేస్తున్న మేస్త్రీ, శ్రీకాకుళానికి చెందిన జగన్ మృతి చెందాడు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలంలో కారు వదిలి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పారిపోయారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ శ్రీశైలం జాతీయ రహదారిపై కొందరు ఆందోళను దిగారు. అయితే, కారు ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ సీటులో ఎవరున్నారనే విషయం తెలియరాలేదు. డ్రైవర్ ఉన్నాడా? లేకపోతే ఎమ్మెల్యే సొంతంగా డ్రైవ్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత ఓ ఎమ్మెల్యే తనకేమీ పట్టనట్టు అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

2018 అక్టోబర్‌లో కూడా జైపాల్ యాదవ్ కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా కర్కల్ పహాడ్ వద్ద హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కారు పాక్షికంగా దెబ్బతింది. అయితే, ఆ ప్రమాదంలో జైపాల్ యాదవ్ సురక్షితంగా బయటపడ్డారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>