Home /News /crime /

TRS LEADER HUSBAND CRUSHED A YOUNG MAN FOR LOVING A YOUNG WOMAN IN KARIMNAGAR DISTRICT SNR KNR

Telangana : ప్రేమించాడని కుర్రాడ్ని చావబాదిన ఎంపీపీ భర్త .. ప్రస్తుతం అతనే పరిస్థితిలో ఉన్నాడంటే

karimnagar leader attack

karimnagar leader attack

Telangana: ప్రేమించడమే నేరమా..? అందుకు చావు దెబ్బలు తినాలా ..? కరీంనగర్ జిల్లాలో అదే జరిగింది. ప్రేమించినందుకు ఓ యువకుడు చావు వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (P.Srinivas,New18,Karimnagar)
    ప్రేమించడమే నేరమా..? అందుకు చావు దెబ్బలు తినాలా ..? కరీంనగర్ జిల్లాలో అదే జరిగింది. ప్రేమించినందుకు ఓ యువకుడు చావు వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నాడు. ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించి సర్ది చెప్పాల్సిన ఆ నాయకుడు విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో ఓ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. స్థానికంగా పేరు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో తమకు ప్రాణహాని ఉందని తమకు న్యాయం చేయాలంటూ కరీంనగర్(Karimnagar)జిల్లా పోలీస్ కమిషనర్‌ ( Police Commissioner)ను ఆశ్రయించారు బాధితులు.

    Crime news : భర్త, కొడుకు ఇద్దరూ కలిసి ఆమెను బ్రతికుండగానే చంపేశారు ..ఛీ అందుకోసం ఇంతటి దారుణమా



    ప్రేమ వ్యవహారంలో రచ్చ ..
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన ఎండి సాదిక్ కుమారుడు ఎండీ అజీజ్.. అదే సామాజిక వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. తమ అమ్మాయిని వేధిస్తున్నాడని అమ్మాయి తండ్రి ఖలీల్ గత రెండు నెలల క్రితం తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఖలీల్ ఫిర్యాదు చేసిన రెండు రోజుల అనంతరం తిమ్మాపూర్ పోలీసులు అజీజ్ కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలవడంతో వెళ్లాడు. అజీజ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఖలీల్ అక్కడికి రాకపోవడంతో పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పి అజీజ్‌ను వెనక్కి పంపించారు.



    యువకుడ్ని కొట్టిన నాయకుడు..
    తన కొడుకును పోలీసులు వెనక్కి పంపించిన విషయం తెలియని అజీజ్ తండ్రి సాదిక్ తన భార్య బిస్మిల్లాను వెంటబెట్టుకొని తిమ్మాపుర్ ఎంపీపీ వద్దకు వెళ్లారు. ఎంపీపీ సమయానికి ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్త కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి విషయం తెలుసుకున్నాడు. సాధిక్, బిస్మిల్లాను తన అనుచరులతో గేటు బయటకు గెంటి వేశారు. అటుపై అజీజ్‌ను ఎంపిపి భర్త ఇష్టం వచ్చినట్లుగా కర్రలతో చావబాదారు. తన కొడుకుని కొట్టవద్దని అజిజ్ తల్లి తండ్రులు దేవేందర్ రెడ్డిని, అతని అనుచరులని ఎంతగా బ్రతిమిలాడినా వినిపించుకోకుండా కొట్టారు. ఎంపీపీ భర్త కొట్టిన దెబ్బలకు అజీజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
    తాము చెప్పినట్టు వినకపొతే గ్రామ బహిష్కరణ చేస్తామని.. చంపేస్తామని ఇదే విధంగా కొన్ని రోజులుగా చిత్రహింసలు పెడుతూ వచ్చారు.

    Love Cheater : ప్రియురాలికి అబార్షన్ చేయించి మరో యువతితో పెళ్లి .. పీటల మీదే చుక్కలు చూపించిన యువతి



    ప్రాణభయంలో బాధితుడి ఫ్యామిలీ..
    ఎంపిపి భర్త దేవేందర్‌రెడ్డి పెట్టె టార్చర్ భరించలేక అజీజ్ పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు అజీజ్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేవేందర్ రెడ్డి అతని అనుచరులతో తమకు ప్రాణహాని ఉందని అజీజ్‌ తల్లిదండ్రులుకరీంనగర్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయ పలుకుబడిని అడ్డుగా పెట్టుకుని తమను చంపడానికి ప్రయత్నిస్తున్న ఎంపీపీ భర్త కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి అతని అనుచరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులు పేర్కొన్నారు. అనారోగ్య కారణంతో తమ కొడుకు అజీజ్ ఆసుపత్రిలో ఉన్నందునే, ఇన్నాళ్లుగా తాము ఫిర్యాదు చేయలేకపోయామని బాధితులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారిస్తామని తెలిపారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Karimnagar, Love affiar, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు