సూర్యాపేటలో దారుణం... టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ హత్య

వెంకన్నను ఇద్దరు బైక్‌పై వచ్చి వెంబడించి వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మరో పదిమందికి పైగా జనం వచ్చి వెంకన్నపై దాడికి దిగారు. అతను పరుగులు పెట్టి ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

news18-telugu
Updated: February 15, 2020, 9:14 AM IST
సూర్యాపేటలో దారుణం... టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ హత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఓ వైపు సహకార సంఘాల ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు అధికార విపక్ష పార్టీల మధ్య వర్గ విబేధాలు కూడా భగ్గు మంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎక్కారం మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. వెంకన్నను కొందరు దుండగులు రాళ్ల తో కొట్టి హతమార్యాచా రాళ్లతో కొట్టి చంపారు దుండగులు. రాత్రి 12 గంటల ప్రాంతంలో వెంకన్నను వెంబడించి హత్య చేసినట్లు తెలుస్తోంది. ముందుగా వెంకన్నను ఇద్దరు బైక్‌పై వచ్చి వెంబడించి వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మరో పదిమందికి పైగా జనం వచ్చి వెంకన్నపై దాడికి దిగారు. అతను పరుగులు పెట్టి ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. తలుపులు పగులగొట్టి మరి వెంకన్నపై  అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి... ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశారు. ఈ దాడిలో గాయపడ్డ మరికొంతమంది కార్యకర్తల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా సహకార సంఘాల ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో వెంకన్నను దారుణంగా హతమార్చారు దుండగులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. గ్రామంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండాచర్యలు చేపట్టారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు