Home /News /crime /

TROOP OF MONKEYS GRABBED A TWO MONTH OLD TODDLER FROM THE TERRACE OF HIS HOUSE HERE IS WHAT HAPPENED NEXT SSR

Monkeys: టెర్రాస్‌పై గదిలో నిద్రిస్తున్న రెండు నెలల పిల్లాడిని ఎత్తుకెళ్లిన కోతులు.. ఎంతపని చేశాయో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ కోతి పసిబిడ్డను ఎత్తుకెళ్లింది. అంతేకాదు, ఆ పిల్లాడిని వాటర్ ట్యాంక్‌లో పడేసింది. పాపం.. ఆ పిల్లాడు ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.

  మీరట్: జంతువులకు విచక్షణా జ్ఞానం ఉండదు. అది లేకపోవడం వల్ల కొన్నిసార్లు జంతువుల వల్ల మనుషులు ఇబ్బంది పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు కూడా వస్తుంది. కోతుల గురించి తెలియందేముంది. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకూ దూకుతూ రచ్చరచ్చ చేస్తుంటాయి. అది వాటి సహజ లక్షణం. ఆలయాల దగ్గర కొబ్బరి చిప్పలను ఎత్తుకెళ్లే కోతులతో పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఓ కోతి పసిబిడ్డను ఎత్తుకెళ్లింది. అంతేకాదు, ఆ పిల్లాడిని వాటర్ ట్యాంక్‌లో పడేసింది. పాపం.. ఆ పిల్లాడు ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని బాగ్‌పట్‌లో కోమల్, ప్రిన్స్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇటీవల బాబు పుట్టాడు. వయసు రెండు నెలలు. కేశవ్ కుమార్ అని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.

  ఇది కూడా చదవండి: OMG: 67 ఏళ్ల ముసలాడిని పెళ్లి చేసుకుంది.. అయ్యగారు శృంగారం చేసిన తీరుకు దెబ్బకు భయపడిపోయి..

  కేశవ్ కుమార్ నానమ్మ కూడా అదే ఇంట్లో నివాసం ఉంటుంది. మనవడిపై ఆమె ఎనలేని ప్రేమ పెంచుకుంది. రాత్రుళ్లు పిల్లాడిని తన దగ్గరే పడుకోబెట్టుకునేది. టెర్రాస్‌పై ఉన్న గదిలో ఆమె నిద్రించేది. రోజూలానే ఆదివారం రాత్రి కూడా మనవడు కేశవ్ కుమార్‌ను తన దగ్గరే ఉంచుకుని ఆమె నిద్రించింది. అయితే.. ఆ గది తలుపులు వేయడం ఆమె మర్చిపోయింది. వేరే గదిలో బిడ్డ తల్లిదండ్రులు నిద్రపోతున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. కోతులు ఆ టెర్రాస్‌పైకి వెళ్లాయి.

  ఇది కూడా చదవండి: Perambalur: ఇదెక్కడి మూర్ఖత్వం.. 70 రూపాయల కోసం కన్న కూతురుని పొట్టనపెట్టుకున్నావ్ కదమ్మా.. ఈ ఇంట్లోనే..

  తలుపులు లాక్ చేసి లేకపోవడంతో ఆ గదిలోకి వెళ్లాయి. నానమ్మ పక్కనే నిద్రపోతున్న ఆ పిల్లాడిని ఎత్తుకుని వెళ్లిపోయాయి. పిల్లాడి నానమ్మ కోతులను తరిమికొట్టి పిల్లాడిని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ రెండు నెలల పసిబిడ్డను తీసుకెళ్లిపోయిన కోతులు సమీపంలోని వాటర్ ట్యాంక్‌లో పడేశాయి. పిల్లాడిని గుర్తించే సమయానికి చనిపోయి నీళ్లలో తేలి కనిపించాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు షాక్‌కు లోనయ్యారు. పిల్లాడి నానమ్మ భోరున విలపించింది. తలుపులు వేసుకుని ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని పశ్చాతాపం వ్యక్తం చేసింది.

  ఇది కూడా చదవండి: Husband: భార్య అదే పనిగా ఫోన్ కాల్స్ మాట్లాడుతుండటంతో ఈ భర్త ఏం చేశాడో చూడండి..

  ఈ ఘటనపై బాబు తల్లిదండ్రులు స్పందిస్తూ.. గతంలో ఒకసారి కూడా ఇంట్లో ఉన్న పిల్లాడిని ఎత్తుకెళ్లేందుకు కోతులు ప్రయత్నించాయని, అప్పుడు కోతులను తరిమి పిల్లాడిని కాపాడుకోగలిగామని కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. టెర్రాస్‌పై నుంచి పిల్లాడిని ఎత్తుకుని ఆ కోతులు కిందకు దూకినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. బాగ్‌పట్‌లో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. కోతుల బెడద ఎక్కువయిందని పలుమార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఇలాంటి ఘటనే బులంద్‌షార్ సమీపంలో జరిగింది. ఓ దున్నపోతు ఇంటి బయట ఆడుకుంటున్న 13 ఏళ్ల పాపను తొక్కి చంపేసింది. ఏపీలోని విజయనగరం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామం వద్ద ఏనుగుల దాడిలో అటవీ శాఖకు చెందిన ఎలిఫాంట్ ట్రాకర్ రాజు(28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలా జంతువుల దాడిలో మనుషులు చనిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Children, Monkeys, Uttar pradesh

  తదుపరి వార్తలు