మోదీ సమక్షంలోనే...త్రిపుర మహిళా మంత్రితో సహచర మంత్రి అసభ్యకర ప్రవర్తన

గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగర్తాలలో నిర్వహించిన ఓ ర్యాలీకి ప్రధాని నరేం‍ద్ర మోదీతో పాటు.. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కూడా హాజరయ్యారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 2:57 PM IST
మోదీ సమక్షంలోనే...త్రిపుర మహిళా మంత్రితో సహచర మంత్రి అసభ్యకర ప్రవర్తన
మోదీ ఎదుటే మహిళా మంత్రికి లైంగిక వేధింపులు
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 2:57 PM IST
మహిళలకు ఎక్కడ కూడా రక్షణ ఉండటం లేదు. బడి, గుడి , ఆఫీస్ ఇలా ఎక్కడికి వెళ్లినా లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ మహిళా మంత్రికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. అది సాక్షాత్తు మోదీ ఉండగానే. త్రిపురలో చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. మదమెక్కి కొట్టుకుంటున్న ఓ మంత్రి... తోటి మహిళా మంత్రిని అసభ్యకర రీతిలో తాకాడు. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అగర్తాలలో నిర్వహించిన ఓ ర్యాలీకి ప్రధాని నరేం‍ద్ర మోదీతో పాటు.. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఆహార మంత్రిత్వ శాఖ మినిస్టర్‌ మనోజ్‌ కంతి దేబ్‌తో పాటు.. త్రిపుర ఏకైకా మహిళా మంత్రి కూడా వెళ్లారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుండగా మనోజ్‌.. సదరు మహిళా మంత్రిని వెనక వైపు నుంచి అసభ్యకర రీతిలో తాకాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహిళా మంత్రి పట్ల మనోజ్‌ తీరును ఎండగడుతున్నాయి ప్రతిపక్షాలు.ప్రధాని, ముఖ్యమంత్రి సమక్షంలో మనోజ్‌ ఓ మహిళా మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె గౌరవానికి భంగం కలిగించారని దుమ్మెత్తి పోశారు.. తక్షణమే అతన్ని పదవి నుంచి తొలగించి.. అరెస్ట్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు మాత్రం మంత్రి మనోజ్ నిరాకరించారు.


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...