TRIPURA CONGRESS LEADER SUDIP ROY BARMAN ATTACKED PVN
Attack: ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన మాజీ మంత్రిపై దాడి..తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరిక
కాంగ్రెస్ నేత సుదీప్ రాయ్ పై దాడి
Congress Leader Attacked: త్రిపుర(Tripura)లో ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 23వ తేదీన త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు(By Elections)జరుగనున్నాయి. జూన్ 26న ఫలితాలు వెలువడనున్నాయి.
Congress Leader Attacked: త్రిపుర(Tripura)లో ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 23వ తేదీన త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు(By Elections)జరుగనున్నాయి. జూన్ 26న ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికలు జరుగనున్న నాలుగు స్థానాల్లో "అగర్తలా"కూడా ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి సుదీప్ రాయ్ బర్మన్..అగర్తలా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. కొద్ది రోజులుగా అగర్తలా(Agartala)నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు సుదీప్ రాయ్ బర్మన్. ప్రచారంలో భాగంగా ఓ సపోర్టర్ ని కలిసేందుకు ఆదివారం రాత్రి అగర్తలాలోని ఉజన్ అభ్యోయ్ నగర్ కి వెళ్లారు సుదీప్ బర్మన్.
ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అనంతరం కారు, కాంగ్రెస్ పార్టీ జెండాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు సుదీప్ రాయ్ బర్మన్. వెంటనే ఆయనను ఐఎల్ఎస్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. అయితే ఈ దాడికి అధికార బీజేపీనే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకునే ఇలా దాడి చేశారని విమర్శించారు. అంతకుముందు మే2న కూడా సుదీప్ రాయ్ భద్రతా సిబ్బంది, డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
సుదీప్ రాయ్ బర్మాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభంలో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ పాలనలో ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగించింది. 1998 నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజీనామా చేసే వరకు రాష్ట్ర రాజధాని అగర్తలా ఎమ్మెల్యేగా ఉన్నారు సుదీప్ రాయ్ బర్మన్.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.