ఈ మధ్య ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన దేశంలో నిత్యం ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరేమో చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరేమో బాగా ఆలోచించే.. ఇక బతకకూడదని నిర్ణయించుకున్నాకే.. సూసైడ్ చేసుకుంటున్నారు. ఉరివేసుకొనో.. విషం తాగో.. లేదంటే నిప్పంటించుకొనో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా నిత్యం ఎన్నో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఐతే వీటిలో కొన్ని మాత్రం చాలా భయానకంగా ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడూ వినని..చూడని విధంగా ఉండి.. విధంగా భయాన్ని కలిగిస్తాయి. ఢిల్లీలో కూడా ఇలాంటి ఆత్మహత్య ఘటనే ఒకటి జరిగింది. తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య (Delhi triple suicide) చేసుకున్నారు. తమ ఇంటిని విషవాయువులతో నింపేసి.. అవి బయటకు వెళ్లకుండా.. పూర్తిగా మూసేసి.. ఆ తర్వాత ఊపిరాడకుండా చేసుకొని.. మరణించారు. ఒళ్లు గొగుర్పొడిచే ఈ ఘటన ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Shocking : మరో నిర్భయ ఘటన..మహిళపై సామూహిక అత్యాచారం..ఆపై ఆమెను దారుణంగా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్ విహార్ (Vasant vihar suicide case)కు చెందిన మంజు, ఉమేష్ చంద్ర శ్రీవాస్తవ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు అనిక, అంకూ. ఉమేష్ గత ఏడాది కరోనాతో మరణించారు. అప్పటి నుంచీ తల్లీకూతుళ్లే ఇంట్లో ఉంటున్నారు. ఐతే ఏం జరిగిందో ఏమో.. శనివారం రాత్రి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడం.. బయట కిటికీలు పాలిథీన్ కవర్లతో మూసేసి ఉండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తలుపులన్నీ లోపలి నుంచి గడియ పెట్టుకొని ఉన్నాయి. ఎంతసేపు డోర్ కొట్టినా.. ఎవరూ బయటకు రాలేదు. పోలీసులు డోర్లు బద్ధలు కొట్టుకొని లోపలికి వెళ్లారు. బెడ్రూమ్లో తల్లీకూతుళ్లు విగతజీవులుగా పడి ఉన్నారు. వారంతా విషవాయువులతో ఊపిరాడక మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
YCP MLC: డ్రైవర్ హత్యకేసు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. ఏ క్షణమైనా వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్..!
ఘటనా స్థలంలో 10 పేజీల సూసైడ్ నోట్ లభించింది. అందులో సంచలన విషయాలు ఉన్నాయి. దానిని బట్టి పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది. ఇళ్లంతా విషవాయువులను నింపి వారు ఆత్మహత్య చేసుకున్నారు. లోపలి గాలి బయటకు పోకుండా ఇంటిని గ్యాస్ ఛాంబర్లా మార్చేశారు. తలుపులు, కిటికీలు వేసి.. ఖాళీల్లేకుండా పాలిథిన్‌తో కప్పి.. టేప్ వేశారు. వెంటిలేటర్లను కూడా పూర్తిగా మూసివేశారు. లోపలి నుంచి గాలి బయటకు వెళ్లకుండా పకడ్బందీగా మూసివేశారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి ఉంది. ఓ చోట కుంపటి కూడా లభించింది. ఇలా ఇంట్లో విష వాయువులను నింపుకొని.. ఊపిరాడకుండా చేసుకొని.. ముగ్గురూ ఆత్మహత్యకు చేసుకున్నారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ చూసి పోలీసులే షాక్ తిన్నారు. ఎందుకంటే అది వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది.
shocking : కారులో మంటలు..నవదంపతులు సజీవ దహనం
''ఈ హెచ్చరిక మీకే.. ఇల్లంతా చాలా ప్రమాదకర విష వాయువుతో నిండి ఉంది. ఇంటి లోపలికి వచ్చిన వారు అగ్గిపుల్లలు, లైటర్లు వంటివి వెలిగించొద్దు. కిటికీలు తెరిచి, ఫ్యాను వేసి గాలి బయటకు వెళ్లిపోయేలా చూడండి" అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. సంచలనం రేపిన ఈ ట్రిపుల్ సూసైడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి ఇంటిని గ్యాస్ చాంబర్‌గా మార్చేశారని పోలీసులు వెల్లడించారు. మంజు భర్త ఉమేష్ గత ఏడాది కరోనతో మరణించిన తర్వాత.. ఈ ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయిందని చెప్పారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని.. అనారోగ్యంతో బాధపడుతున్న మంజు ఆస్పత్రికి వెళ్లేందుకు కూడా డబ్బులు లేవని.. ఈ కారణాల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటారని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Delhi, New Delhi