Man guns down his third wife: పంజాబ్(Punjab)రాష్ట్రంలో అమానవీయ ఘటన జరిగింది. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి గత తన భార్య మరియు ఆమె తల్లిదండ్రులను కాల్చి చంపాడు. సోమవారం రాత్రి జలంధర్ లోని ఈ ఘటన జరిగింది.
జలంధర్ లో శివ్ నగర్ ప్రాంతంలో నివసించే సునీల్..ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం సాయంత్రం తన భార్య శిల్పితో సునీల్ కి గొడవ అయింది. ఆ తర్వాత శిల్పి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. గొడవని సద్దుమణిగించేందుకు స్థానికులు కూడా తరలివచ్చారు. ఆ తర్వాత సునీల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అర్థరాత్రి ఇంటికొచ్చిన సునీల్.. భార్య శిల్పితో పాటు ఆమె తండ్రి అశోక్, తల్లి కృష్ణను తుపాకీతో కాల్చాడు. ముగ్గురిపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. సునీల్ కుమార్ తన భార్య శిల్పి, ఆమె తండ్రి అశోక్, తల్లి కృష్ణను హత్య చేసిన తర్వాత ఘటన నుంచి పారిపోలేదు. బదులుగా, పోలీసులు తన ఇంటికి చేరుకునే వరకు అతను అక్కడే ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా,సునీల్‌కి ఇది మూడో పెళ్లి. వీరికి మూడేళ్ల క్రితం వివాహమై రెండేళ్ల పాప ఉంది.
ALSO READ Man fight to get Rs 35 refund : రూ.35 కోసం రైల్వేతో పోరాడి..3 లక్షల మందికి లబ్ది చేకూర్చిన ఇంజినీర్
మరోవైపు,ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణం జరిగింది. కస్ గంజ్ జిల్లాలో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. నిందితులు.. 11 వ తరగతి చదువుతున్న బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో కూల్ డ్రింక్ తాగించారు. ఆ తర్వాత.. దానిలో మత్తు పదార్థం కల్పి ఇచ్చారు. ఆ తర్వాత.. ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక అపస్మారక స్థితిలోనికి వెళ్లాక వీడియో కూడా తీశాడు.
వీడియో చూపిస్తు ఆమెను డబ్బుల కోసం వేధించారు.ఇప్పటికే ఆమె 8 లక్షలు ఇవ్వాలిని లేకపోతే వీడియో బైట (block mailing) పెడతామన్నారు. దీంతో బాలిక ఇంటి నుంచి డబ్బులు దొంగిలించి అతనికి ఇచ్చింది. ఈ క్రమంలో బాలిక జరిగిన దారుణాన్ని ఇంట్లో చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Husband kill wife, Murder, Punjab