కర్నూలులో ఘోరం.. భర్తను చితకబాది గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్

తమకు జరిగిన అన్యాయంపై భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐనా ఎవరూ పట్టించుకోవడం బాధితురాలు బంధువులు వాపోతున్నారు.

news18-telugu
Updated: August 3, 2020, 2:48 PM IST
కర్నూలులో ఘోరం.. భర్తను చితకబాది గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కఠిన శిక్షలు పడుతున్నా.. బలమైన చట్టాలు తెస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఏ మాత్రం భయం లేకుండా ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పుడుతూనే ఉన్నారు. దేశంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా వెలుగోడులో ఘోరం జరిగింది. గిరిజన వివాహితను దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. భర్తతో కలిసి వెళ్తున్న వివాహితను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి కొట్టి పడేశారు. జమ్మినగర్ తండాలో అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.

తమకు జరిగిన అన్యాయంపై భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐనా ఎవరూ పట్టించుకోవడం బాధితురాలు బంధువులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి అండగా జమ్మినగర్ తండాలో గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని కోతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 3, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading