
ప్రతీకాత్మక చిత్రం
భర్త, మరిది తాగొచ్చి బాధితురాల్ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆమె గట్టిగా అరుపులు పెట్టి ఏడ్వడం మొదలుపెట్టింది.
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు రక్షణ కల్పించాల్సిన భర్తే దగ్గరుండి మరీ ఆమెకు లైంగిక వేధింపులకు గురి చేశాడు. వరుసకు సోదరుడైన మరో వ్యక్తితో భార్యపై నిత్యం అత్యాచారం చేయించాడు. ఈ ఘటన ఒడిశాలోని కియన్జర్ జిల్లాలో చోటు చేసుకుంది. భర్త నిత్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. వరుసకు సోదరుడైన మరో వ్యక్తిని దగ్గరుండి మరీ భార్యపై అత్యాచారం చేయించాడు. అంతేకాకుండా ఈ దారునాన్ని సెల్ ఫోన్లో రికార్డ్ కూడా చేసేవాడు. ఈ నేపథ్యంలో గతరాత్రి కూడా భార్యకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. భర్త, మరిది తాగొచ్చి బాధితురాల్ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆమె గట్టిగా అరుపులు పెట్టి ఏడ్వడం మొదలుపెట్టింది. దీంతో ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... భర్తతో పాటు... అతడి సోదరుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వద్ద ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసును విచారణ చేస్తున్నారు. భర్త మొబైల్ ఫోన్ తీసుకొని సీజ్ చేశారు. గిరిజనుడైన భర్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
Published by:Sulthana Begum Shaik
First published:June 30, 2019, 08:46 IST