మరో ఘోరం.. గిరిజన బాలికను కిడ్నాప్ చేసి 4 నెలలుగా అత్యాచారం

గది నుంచి అతి కష్టం మీద తప్పించుకున్న బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్ కోలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

news18-telugu
Updated: December 6, 2019, 3:09 PM IST
మరో ఘోరం.. గిరిజన బాలికను కిడ్నాప్ చేసి 4 నెలలుగా అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ దిశా హత్యాచారం నేపథ్యంలో మహిళ భద్రతపై దేశమంతటా చర్చ జరుగుతోంది. రేపిస్టులకు ఉరిశిక్షపడేలా కఠిన చట్టాలు తేవాలంటూ యావత్ దేశం నినదిస్తోంది. ఓ వైపు ఇది జరుగుతున్నా.. మరోవైపు మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గుజరాత్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన 14 ఏళ్ల గిరిజన బాలికను కిడ్నాప్ చేసి.. గుజరాత్‌కు తీసుకెళ్లి.. ఆమెపై 4 నెలలుగా అత్యాచారం చేశారు ముగ్గురు రాక్షసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దున్గార్‌పూర్‌కు చెందిన బాలికను నలుగురు వ్యక్తులు ఆగస్టులో కిడ్నాప్ చేశారు. రేప్ చేసిన తర్వాత.. ఆమెను కారులో తీసుకెళ్లి గుజరాత్‌లోని అమీర్ గఢ్ ప్రాంతంలో వాడియా కోలి అనే వ్యక్తి అప్పగించారు. అతడు కూడా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ధనేరా ప్రాంతానికి తీసుకొచ్చి మహేష్ కోలి అనే మరో వ్యక్తికి అప్పగించాడు. మహేష్ కోలి, అతని సోదరుడు స్థానికంగా ఓ వ్యవసాయ క్షేత్రంలో పని చేసేవారు. అక్కడ ఓ గదిలో బాలికను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడుతున్నారు. గత నాలుగు నెలలుగా ఆమెపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఆ గది నుంచి అతి కష్టం మీద తప్పించుకున్న బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్ కోలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>