'2.0' నిజమైంది... 297 పక్షుల ప్రాణాలు తీసిన 5జీ ప్రయోగం...

నెదర్లాండ్‌లో 5జీ ప్రయోగం... రేడియేషన్ కారణంగా క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన 297 పక్షులు... అదే సంఖ్యలో జంతువులు కూడా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 5, 2018, 9:16 PM IST
'2.0' నిజమైంది... 297 పక్షుల ప్రాణాలు తీసిన 5జీ ప్రయోగం...
5జీ ప్రయోగం కారణంగా ప్రాణాలు విడిచిన పక్షులు (photo: twitter)
  • Share this:
‘2.0’ సినిమాలో పక్షిరాజు అక్షయ్ కుమార్...సెల్‌ఫోన్ల కారణంగా లక్షలాది పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని వాపోతాడు. మొబైల్ వాడే ప్రతి ఒక్కడూ ఓ హంతకుడే అని తన వేదనను వినిపిస్తాడు. అది నిజం కాదని, అవాస్తవాలు ప్రచారం చేస్తూ తమ బ్రాండ్ వాల్యూని దెబ్బతీస్తున్నారంటూ కొన్ని సెల్‌ఫోన్ కంపెనీలు సినిమా దర్శకుడు, నిర్మాతలపై దావా వేశాయి కూడా. అయితే మొబైల్ ఫోన్ల కారణంగా పక్షులకు ఎంత ముప్పు వాటిల్లుతుందో చెప్పేందుకు సాక్ష్యంగా తాజాగా జరిగిన ఓ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. నెదర్లాండ్స్‌లో కొన్ని రోజుల క్రితం చేసిన 5జీ ప్రయోగం కారణంగా 297 పక్షలు ప్రాణాలు కోల్పోయాయి.

నెదర్లాండ్‌లోని హాగ్ ప్రాంతంలో ఉన్నట్టుండి ఆకాశం నుంచి వందలాడి పక్షులు నేల మీద రాలిపడ్డాయి. అచేతనంగా పడి ఉన్న వందలాది పక్షులను చూసి జంతు ప్రేమికులతో సహా సాధారణ పౌరుల హృదయాలు కూడా ద్రవించి పోయాయి. ఇంతకు ఏం జరిగింది... ఒక్కసారిగా ఇన్ని పక్షులు ఎందుకిలా నేలకొరగడానికి కారణం... 5జీ ప్రయోగం..డచ్ రైల్వే స్టేషన్ పరిధిలో కొన్ని సెకన్ల పాటు 5జీ టెస్ట్ సిగ్నల్ చెక్ చేశారు. ఆ ప్రయోగం జరిగిన వెంటనే... ఆ ఫ్రీగ్వేసీని తట్టుకోలేక దాదాపు మూడు వందల పక్షులు నెలకొరిగి ప్రాణాలు విడిచాయి. ఆకాశంలో ఎగురుతున్న పక్షులతో పాటు చుట్టుపక్కల కొలనుల్లో ఉన్న బాతులు కూడా రేడియేషన్ కారణంగా నీటమునిగి చనిపోయాయి. పక్షులతో సమానంగా జంతువులు కూడా చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. సెకనుకి మిలియన్ల మైక్రోవేవ్స్ రిలీజ్ అవ్వడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక మూగజీవులు ప్రాణాలు విడిచినట్టు పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినవారందరూ ‘పిడికెడంత పిట్టే మన మధ్య బతకలేనప్పుడు... మనం ఎంత అభివృద్ధి చెంది మాత్రం ఏం లాభం...’ అని '2.0' సినిమాలో పక్షిరాజు చెప్పిన డైలాగ్ గుర్తుచేసుకుంటున్నారు.

First published: December 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు