హోమ్ /వార్తలు /క్రైమ్ /

Lucky: పండుగ పూట అదృష్టం అంటే వీళ్లదే.. ఎంత అంటే.. ఇది చూస్తే మీకే అర్థం అవుతుంది..

Lucky: పండుగ పూట అదృష్టం అంటే వీళ్లదే.. ఎంత అంటే.. ఇది చూస్తే మీకే అర్థం అవుతుంది..

ఘటనా ప్రదేశంలో ప్రమాదకర దృశ్యాలు

ఘటనా ప్రదేశంలో ప్రమాదకర దృశ్యాలు

Lucky: పండుగ పూట ఇంటిల్లిపాది కలిసి సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు. ఉపాధి కోసం వెళ్ళిన ఊరి నుండి స్వస్థలాలకు బయలుదేరారు. విధికి కన్నుకుట్టిందో ఏమో గమ్యాలు చేరక ముందే ప్రమాదం రూపంలో వారికి పరీక్ష పెట్టింది. కాని వారి అదృష్టం బాగుండి స్వల్ప గాయాలతో భయటపడ్దారు. వివరాలిలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(K.Lenin,News18,Adilabad)

పండుగ పూట ఇంటిల్లిపాది కలిసి సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు. ఉపాధి కోసం వెళ్ళిన ఊరి నుండి స్వస్థలాలకు బయలుదేరారు. విధికి కన్నుకుట్టిందో ఏమో గమ్యాలు చేరక ముందే ప్రమాదం రూపంలో వారికి పరీక్ష పెట్టింది. కాని వారి అదృష్టం బాగుండి స్వల్ప గాయాలతో భయటపడ్దారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ప్రమాదాలు ఏమిటి, అవి ఎలా జరిగాయో తెలుసుకోవాలని ఉందా. అయితే ఇది పూర్తిగా చదవండి. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసి బస్సు 28 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ నుండి మంచిర్యాలకు బయలుదేరింది. అయితే ఆ బస్సు గుడిహత్నూరు బస్టాండ్ నుండి బైపాస్ రోడ్డుపైకి చేరుతుండగా, నిర్మల్ నుండి ఆదిలాబాద్ వైపు వస్తున్న కంటైనర్ లారీ వేగంగా బస్సు ఢీకొట్టింది.

Minor: రాత్రి తండ్రి, పగలు కొడుకులు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కుటుంబసభ్యులు.. ఆ ఇంటి ఇల్లాలు కూడా..


Extramarital Affair: పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తెలుసుకున్న భార్య ఏం చేసిందో చూడండి..


దీంతో ఆర్టీసి బస్సు అదుపు తప్పి బైపాస్ రోడ్డుపై నుండి పక్కనున్న సర్వీస్ రోడ్డుపైకి పల్టి కొట్టింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి పరుగులుదీశారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సు కింద ఎవరైనా చిక్కుకొని ఉండవచ్చన్న అనుమానంతో అందరు కలిసి బస్సును పైకి ఎత్తారు. అదృష్టవశాత్తు బస్సు కింద ఎవ్వరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో 28 మంది ప్రయాణికులుండగా వారిలో డ్రైవర్, కండక్టర్ తోపాటు మరో పది మందికి గాయాలయ్యాయి. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని వెంటనే చికిత్స కోసం అంబులెన్స్ ల ద్వారా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Sadist: నిశ్చితార్థాన్ని అడ్డం పెట్టుకున్నాడు.. కాబోయే భార్యతో అతడు ఏం చేశాడో తెలుసా.. ముగింపు ఊహించలేరు..


కాగా బస్సు బైపాస్ పై చేరుతున్న క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ కారణంగా అటు వైపు నుండి వస్తున్న లారీని బస్సు డ్రైవర్ గమనించలేకపోయారు. గుడిహత్నూర్ బస్టాండ్ వద్ద ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరారు. హైదరాబాద్ నుండి నాగ్ పూర్ వైపు బయలుదేరిన ఈ బస్సు నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామ శివారుకు చెరుకోగానే అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకుపోయింది. ఈ సమయంలో బస్సులోని ప్రయాణికులంతా నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా తేరుకొని ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి.

Very Sad: పొలంలో కూలీ పనులు చేస్తున్న మహిళ.. ఏం చేస్తున్నావ్ అంటూ.. వెనుక నుంచి వచ్చిన భూ యజమాని.. ఒక్కసారిగా..


మరో ఏడుగు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం నిర్మల్, హైదరాబాద్, ఆదిలాబాద్ లలోని ఆసుపత్రులకు తరలించారు. క్షేమంగా బయటపడ్డవారు నిర్మల్ బస్టాండ్ కు వెళ్ళి అక్కడి నుండి అందుబాటులో ఉన్న వాహనాల్లో స్వస్థలాలకు వెళ్ళిపోయారు. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఆర్టీసి బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంచిర్యాల ఆర్టీసి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు 34 మంది ప్రయాణికులతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బురదగూడకు చేరుకోగానే బస్సు డ్రైవర్ నగేష్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది.


Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..

దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకుపోయింది. దీంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. ఈ ప్రమాదంలో ఏఒక్కరికి కూడా ఏమి కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత మంచిర్యాలకు తరలించారు. కాగా బస్సులోని ప్రయాణికులు ఇతర వాహనాల్లో వెళ్ళారు. మొత్తంమీద ఆయా ఘటనల్లో పెను ప్రమాదాలు తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో వారి అదృష్టం గట్టిదని, అందుకే ఎవరికి ఏమి కాలేదని స్థానికులు చర్చించుకోవడం వినిపించింది.

First published:

Tags: Adilabad, Cirme, Road accidents

ఉత్తమ కథలు