యువకుడికి మత్తుమందు ఇచ్చిన హిజ్రాలు... తేరుకుని చూసుకుంటే పురుషాంగం కట్

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడికి మత్తుమందు ఇచ్చిన ముగ్గురు హిజ్రాలు... అతడి పురుషాంగాన్ని కోసేశారు.

news18-telugu
Updated: May 21, 2019, 5:24 PM IST
యువకుడికి మత్తుమందు ఇచ్చిన హిజ్రాలు... తేరుకుని చూసుకుంటే పురుషాంగం కట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తనతో స్నేహంగా ఉన్న ముగ్గురు హిజ్రాలతో సన్నిహితంగా మెలిగాడు ఓ యువకుడు. వారి మాటలు విని... వారిచ్చిన ఛాయ్ తాగాడు. ఆ తరువాత నిద్రలోకి జారిపోయాడు. అయితే మెలుకువ వచ్చే చూసుకుంటే అతడి పురుషాంగం కోసేసి ఉంది. దీంతో యువకుడు అరుపులు, కేకలు వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహన్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... బాధితుడు సత్రువలి గ్రామానికి చెందిన వ్యక్తి యువకుడు ఓ పెళ్లిలో బ్యాండ్ వాయించడానికి వెళ్లాడు. అక్కడ ముగ్గురు హిజ్రాలతో అతడికి పరిచయం ఏర్పడింది.

బాధితుడితో కొద్ది గంటల పాటు సరదాగా గడిపిన హిజ్రాలు... అనంతరం అతడికి మత్తుమందు కలిపిన ఛాయ్ ఇచ్చారు. అది తాగి నిద్రలోకి జారుకున్న తరువాత నిందితుడి మర్మాంగం కోసేశారు. అయితే ఈ విషయం బాధితుడికి తెలియలేదు. కొన్ని గంటల తరువాత మెల్లిగా నిద్ర నుంచి తేరుకున్న ఆ యువకుడు... నొప్పి భరించలేక ఏం జరిగిందో చూసుకున్నాడు. తన అంగం కోసి ఉండటం చూసి షాక్ అయిన యువకుడు వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనకు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు... బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading