హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘మా ఆయన కొడుతున్నాడు’: మహిళా కమిషన్‌లో హిజ్రా ఫిర్యాదు

‘మా ఆయన కొడుతున్నాడు’: మహిళా కమిషన్‌లో హిజ్రా ఫిర్యాదు

హిజ్రాలు (File)

హిజ్రాలు (File)

అసలు తన భర్త తనను కొడుతున్నాడంటూ ఆ హిజ్రా మొదటగా పోలీసుల వద్దకు వెళ్లింది. అయితే, వారు చీత్కరించారు.

  తన భర్త తనను కొడుతున్నాడని, రోజూ గొడవ పడుతున్నాడంటూ ఓ హిజ్రా కేంద్ర మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతే కాదు తనను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆలియా (పేరు మార్చాం) ట్రాన్స్‌జెండర్. గత నాలుగేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. రెండేళ్ల క్రితం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లయిన మూడు నెలల నుంచి భర్త టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆమెను కొట్టడంతో పాటు మరో పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు ఆమెను చావబాదాడు. దీంతో బాధితరాలు ఢిల్లీలోని మహిళా కమిషన్ ఆఫీసు మెట్లు ఎక్కింది.


  హిజ్రాలు (File)
  హిజ్రాలు (File)


  అసలు తన భర్త తనను కొడుతున్నాడంటూ ఆ హిజ్రా మొదటగా పోలీసుల వద్దకు వెళ్లింది. అయితే, వారు చీత్కరించారు. ఆమె ఫిర్యాదు తీసుకోకుండా వెళ్లగొట్టారు. తన భర్త తనను చావబాదాడని, అతడు కొట్టిన దెబ్బలకు తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని హిజ్రా వేడుకున్నా వారు పట్టించుకోలేదు. తన భర్త తరఫు బంధువులు తనను చంపేయాలని చూస్తున్నారని ఆలియా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం తాము పెళ్లి చేసుకున్నట్టు అన్ని పత్రాలను కమిషన్‌కు ఆలియా అందజేసింది.


  హిజ్రాలు (File)
  హిజ్రాలు (File)


  భర్త వేధిస్తున్నా పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో మహిళా కమిషన్ ఆమెకు అండగా నిలిచింది. వెంటనే నందనగర్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులు పంపింది. ఘటనపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. దీంతోపాటు ఢిల్లీ లీగల్ సెల్ అధారిటీ ద్వారా ఆలియా భర్త మీద కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. ఆలియా తరఫున వాదించడానికి ఓ న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసింది.

  First published:

  Tags: New Delhi, Transgender

  ఉత్తమ కథలు