Home /News /crime /

TRANSGENDER RACKET BUSTED GANG TARGETS UNEMPLOYED ASSAM YOUTH FOR BEGGING VB GH

వాళ్లకు నిరుద్యోగ యువతే టార్గెట్.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు.. పట్టణానికి రప్పించి.. ఆ పని చేయమంటారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Transgender Racket: అస్సాంలోని ధుబ్రీ, మన్ కచ్చర్ వంటి ప్రాంతాలకు చెందిన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని యువకులను ఈ ముఠా టార్గెట్ చేస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పట్టాణానికి రమ్మంటారు. వాళ్ల వద్దకు వచ్చిన తర్వాత ట్రాన్స్ జెండర్లుగా మార్చి వీధుల్లో అడుక్కుతినేలా చేస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
పేదరికం, నిరుద్యోగ సమస్యలు అస్సాం యువకులను మోసగాళ్ల చేతిలో కీలుబొమ్మల్లా మారుస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో వారిని ట్రాన్స్ జెండర్లుగా మార్చి వీధుల్లో అడుక్కుతినేలా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇలాంటి ఓ ముఠాను తాజాగా దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌహతిలో ఓ పెద్ద ట్రాన్స్ జెండర్ ముఠాను అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ తతంగం నడుస్తోందని పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ బృందానికి చెందిన ఐదుగురు వ్యక్తులతో పాటు వీరిని పూర్తిగా హ్యాండిల్ చేసే పింకీ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ట్రాన్స్ యాక్టివిస్ట్, అడ్వకేట్ స్వాతి బిధన్.. బారువా పాన్ బజార్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. అస్సాంలోని ధుబ్రీ, మన్ కచ్చర్ వంటి ప్రాంతాలకు చెందిన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని యువకులను ఈ ముఠా టార్గెట్ చేస్తోంది. దిల్లీలో ఉద్యోగాలు ఉన్నాయంటూ వారిని నమ్మిస్తారు. తరువాత దిల్లీ తీసుకొచ్చి అక్కడ వారికి బలవంతంగా ఆపరేషన్ల ద్వారా లింగమార్పిడి చేయిస్తున్నారు. వారిని ట్రాన్స్ జెండర్లుగా మార్చి.. దిల్లీ వీధుల్లో అడుక్కునేలా చేస్తున్నారు.

కొన్ని నెలల తర్వాత వారిని అస్సాం పంపించి అక్కడి మార్కెట్లలో అడుక్కోవాలని ఆదేశిస్తున్నారు. దీని గురించి ఆ ముఠా బారిన పడిన ఓ ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ.. "నేను రెండు సంవత్సరాల పాటు దిల్లీలో ఉన్నాను. అక్కడ కొంచెం డబ్బు సంపాదించుకున్నాను. ఆ తర్వాత నన్ను అస్సాంకు పంపి, అక్కడే ఈ పని చేయమని చెప్పారు " అంటూ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన పింకీ అలియాస్ మహమ్మద్ అలీ ఈ రాకెట్ సూత్రధారి. ఆమె ఈ గ్యాంగ్ ని కమిషన్ బేసిస్ పై నడుపుతున్నారు. తనతో పాటు దీనికి కారకులైన మరో ఆరుగురిని కూడా పాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మేం ఈ రాకెట్ కి సంబంధించిన కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.

ఆ తర్వాతే మేం వివరాలు వెల్లడించే వీలుంటుంది’ అని పోలీసులు చెప్పారు. స్వాతి కంప్లయింట్ ఆధారంగా అస్సాంలో కూడా ఈ కేసుపై దర్యాప్తు జరిపించాల్సిందిగా అక్కడి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్యాంగ్ బారిన పడిన వ్యక్తుల్లో చాలామందికి పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. వీరిని అడ్డు పెట్టుకొని పింకీ కోట్ల రూపాయలు సంపాదించింది. ఆమె ఆస్తులన్నింటినీ సీజ్ చేయించడానికి కూడా ప్రయత్నిస్తామని అడ్వకేట్ స్వాతి వెల్లడించారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్లు అసలు నిందితులు కాదని.. వారు అమాయకులు అంటూ గౌహతిలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు ముందు ట్రాన్స్ జెండర్లు ధర్నా చేయడం గమనార్హం.
Published by:Veera Babu
First published:

Tags: Assam, Crime, Crime news, Delhi, Delhi police, Transgender

తదుపరి వార్తలు