రైల్లో రెచ్చిపోయిన హిజ్రా.. యువకుల్ని బూతులు తిడుతూ...

సీకింద్రబాద్ నుండి నాగపూర్ వెళ్లే నాగపూర్ ఫాస్ట్ ప్యాసింజర్ లో హిజ్రా హల్ చేసింది. ప్రయాణికులపై తన ప్రతాపం చూపింది.

news18-telugu
Updated: August 27, 2019, 12:15 PM IST
రైల్లో రెచ్చిపోయిన హిజ్రా.. యువకుల్ని బూతులు తిడుతూ...
రైలులో హిజ్రా హల్ చల్
  • Share this:
చాలామంది హిజ్రాలు  బస్టాపుల్లో.. రద్దీ ప్రాంతాల్లో జనాన్ని ఇబ్బందులు పెడుతుంటారు. కొందరు మామలుగా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని అడుగుతారు. మరికొందరైతే... డబ్బులు ఇవ్వకుంటా నానా బూతులు తిడుతూ జనంపై విరుచుకుపడుతుంటారు. ఇంకొందరైతే.. శృతిమించి అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. అదే తరహాలో ఓ హిజ్రా రైల్లో రెచ్చిపోయింది. సీకింద్రబాద్ నుండి నాగపూర్ వెళ్లే నాగపూర్ ఫాస్ట్ ప్యాసింజర్ లో హిజ్రా హల్ చేసింది.  ప్రయాణికులపై తన ప్రతాపం చూపింది. యువకుల్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రయాణికులను బూతులు తిడుతూ మహారాష్ట్ర యువకులను కొడుతూ డబ్బులు వసూలు చేస్తుండటంతో కొంతమంది యువకులు ఎదురు దాడికి దిగారు. ఈ ఘటన అంత జమ్మికుంట స్టేషన్ నుండి రామగుండం స్టేషన్ మధ్యలో జరుగింది. అయితే రామగుండం స్టేషన్ లో రైల్వే పోలీసులు రావడంతో హిజ్రా పారిపోయింది. రైళ్లలోకొందరు హిజ్రాలు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ తమను ఇబ్బందులు పాలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>