news18-telugu
Updated: October 9, 2020, 6:32 AM IST
ఫ్రతీకాత్మక చిత్రం
తెలంగాణలోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఓ ట్రైనీ పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి డిన్నర్ పూర్తైన తర్వాత తన గదిలోకి వెళ్లిన అతడు ఊరి వేసుకున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అయతే డిప్రెషన్ వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు చెబుతున్నారు. వివరాలు.. కేరళలోని కొట్టాయం జిల్లాకి చెందిన ఆకాశ్ పి డొమ్నిక్ హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ట్రైనీ పైలట్‌గా ఉన్నాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో డిన్నర్ పూర్తిచేసిన ఆకాశ్ తన రూమ్‌కు వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం బ్రీఫింగ్‌కు ఆకాశ్ హాజరుకాలేదు. అనంతరం ఆకాశ్ పక్క రూమ్‌లో ఉండే మరో శిక్షణ అభ్యర్థి ఈశ్వర్, మెస్ బాయ్ మధుతో కలిసి అతని రూమ్ వద్దకు వచ్చాడు. పలుమార్లు తలుపు కొట్టిన కూడా ఆకాశ్ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో వారిద్దరు బలవంతంగా డోర్ ఓపెన్ చేశారు. రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఆకాశ్ ఊరి వేసుకుని కనిపించాడు.
ఈ విషయాన్ని వారు అధికారులకు తెలిపారు. దీంతో ఫ్లైయింగ్ పైలట్ శరద్ కుమార్ అల్వాల్ పోలీసులుకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 174 కింద అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అల్వాల్ ఎస్ఐ భాస్కర్ మాట్లాడుతూ.. "ఆకాశ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు కనిపించేవాడని అతని సహచరులు, సిబ్బంది చెప్పారు. అయితే అతని ఆత్మహత్యకు అసలు కారణం ఇంకా తెలియలేదు" అని చెప్పారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 9, 2020, 6:32 AM IST