rape: ట్రైనీ ఐఏఎస్ మృగేందర్‌పై రేప్ కేసు -వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కొడుకు నిర్వాకమిదే..

(photo credit : sakshi)

అతను మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ప్రస్తుతం ఐఏఎస్ ట్రైనీ.. గతంలో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసినా, మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ గా మధురై అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అయితే, ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడని, పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని హైదరాబాద్ లో కేసు నమోదైంది. పోలీస్ అకాడమీ గదిలోనే అత్యాచారానికి గురయ్యానని బాదితురాలు చెప్పడం, టీఆర్ఎస్ నేత కొడుకు నిర్వాకం కావడంతో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది..

  • Share this:
(G. Srinivasa Reddy, News 18, Khammam)
ఖమ్మం జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ బాణోత్ మృగేందర్‌ లాల్ నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్ఎస్ నేత బాణోత్ మదన్ లాల్ కొడుకే ఈ మృగేందర్‌. పెళ్లి పేరుతో మోసం చేశాడని, ఐపీఎస్ అకాడమీలోనే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..



బాణోత్ మృగేందర్‌ లాల్ ప్రస్తుతం మధురైలో ఏఐఎస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. గతంలో అతను ఐపీఎస్ ట్రైనింగ్ కూడా పొందాడు. ఆ సమయంలో దగ్గరి బంధువు అవుతానంటూ ఫేస్‌బుక్‌లో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. క్రమంగా వాళ్లిద్దరూ దగ్గరై వ్యవహారం ప్రేమ దాకా వచ్చింది. పెళ్లి చేసుకుందామని యువతికి మాటిచ్చిన మృగేందర్‌.. ఆ అమ్మాయిని నేరుగా పోలీస్‌ అకాడమీకే పిలిపించుకుని, తన గదిలోనే పలుమార్లు లైంగికదాడి చేశాడు. మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ కొట్టిన తర్వాత కూడా ఈ యువతితో సంబంధం కొనసాగించాడు మృగేందర్‌. కానీ..

బాధిత యువతితో సంబంధం కొనసాగిస్తూనే తన ఐఏఎస్ బ్యాచ్ మేట్ అయిన మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైమయ్యాడు మృగేందర్‌. ప్రస్తుతం మధురై అకాడమీలోనే శిక్షణ పొందుతోన్న యూపీకి చెందిన అమ్మాయితో మృగేందర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిశాక బాధిత యువతి నేరుగా మృగేందర్ ఇంటికెళ్లి, అతని తండ్రి (వైరా మాజీ ఎమ్మెల్యే) మదన్ లాల్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కానీ..

మృగేందర్ మోసం చేసిన విషయాన్ని మదన్ లాల్ కు చెప్పగా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే రూ.25 లక్షలు ఇస్తానని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడని బాధిత యువతి చెబుతోంది. కొడుకు చేసిన తప్పుడు పనులకు తండ్రి అండగా ఉన్నాడని, మృగేందర్ ను మర్చిపోకపోతే ప్రాణాలతో మిగలవని మదన్ లాల్ వార్నింగ్ కూడా ఇచ్చాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. దాని ఆధారంగా పోలీసులు మృగేందర్, మదన్ లాల్ సహా ముగ్గురిపై గత నెల 27న  కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ కీలక నేత కొడుకు కావడంతో ఐఏఎస్ ట్రైనీ మృగేందర్ పై రేప్ కేసును పోలీసులు ఎలా డీల్ చేస్తారోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
Published by:Madhu Kota
First published: