Train Derailment : ఇరాన్(Iran)లో ఘోర రైలు ప్రమాదం(Train Accident)జరిగింది. తూర్పు ఇరాన్‌లోని ఎడారి నగరమైన తబాస్ సమీపంలో బుధవారంఉదయం 5:30 గంటల సమయంలో ఓ ప్యాసింజర్ రైలు(Passenger Train) పట్టాలు తప్పింది. 348 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న రైలు, తబాస్ నుండి 50 కిమీ (31 మైళ్ళు) దూరంలో మషాద్ మరియు యాజ్ద్ నగరాల మధ్య పట్టాలు తప్పింది(Train derailment).ఏడు బోగీలు ఉన్న రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఇరాన్ అధికార టీవీ తెలిపింది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే.. అక్కడికి రెస్క్యూ బృందాలు బయలుదేరాయి. అది కమ్యూనికేషన్ సరిగా లేని మారుమూల ప్రాంతం కావడంతో.. మూడు హెలికాప్టర్లలో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. .రైలు పట్టాలకు సమీపంలో ఉన్న ఎస్కవేటర్‌ను రైలు బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే రాత్రి సమయంలో ఎస్కవేటర్ అక్కడ ఎందుకు ఉందో స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. ఏదైనా మరమ్మత్తు ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ ఉందేమోనని అనుమానిస్తున్నారు. ప్రమాదం దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై తబాస్ గవర్నర్ అలీ అక్బర్ రహిమీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Russia-Ukraine War: యూఎస్, యూకే రాకెట్ లాంచర్‌లతో రష్యాకు సవాలు.. ఉక్రెయిన్ కు యూఎస్ అందిస్తున్న మిలిటరీ ప్యాకేజీ ఏంటి..?
కరోనాతో అనాథలైన చిన్నారులు..లోన్ కట్టాలంటూ LIC నోటీసులు..చివరికి
ఇక, ఇరాన్‌లో 2016లో జరిగిన మరో రైలు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇరాన్ లో ఏడాదికి సగటున 17,000 మంది ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ విస్మరించి వాహనాలు నడపడం వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ట్రాఫిక్ చట్టాలను విస్మరించడం, అసురక్షిత వాహనాలు, అత్యవసర సేవలు సరిపడ లేకపోవడం మరణాల సంఖ్య అధికంగా ఉండటానికి కారణంగా తెలుస్తోంది.
మరోవైపు, ఢిల్లీ(Delhi)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జామియా నగర్లో ని మెట్రో పార్కింగ్(Metro Parking) స్థలంలో ప్రమాదవశాత్తూ బుధవారం ఉదయం భారీగా మంటలు(Fire Accident)చెలరేగాయి. దీంతో పార్కింగ్ లోని దాదాపు వంద వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి( Vehicles Gutted).దాదాపు 80 ఎలక్ట్రిక్ రిక్షాలు(ఇందులో 30 కొత్తవి),10 కార్లు,2 స్కూటీలు,ఒక మోటర్ బైక్ పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Iran, Train accident