హోమ్ /వార్తలు /క్రైమ్ /

దుర్గామాత నిమజ్జనంలో అపశృతి..నది ఉప్పొంగి 8మంది మృతి,పలువురు గల్లంతు!

దుర్గామాత నిమజ్జనంలో అపశృతి..నది ఉప్పొంగి 8మంది మృతి,పలువురు గల్లంతు!

దుర్గాదేవి విగ్రహ నిమజ్జనంలో అపశృతి

దుర్గాదేవి విగ్రహ నిమజ్జనంలో అపశృతి

Flash Flood During Durga Idol Immersion : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున వెస్ట్ బెంగాల్(West Bengal) లో విషాదం చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Flash Flood During Durga Idol Immersion : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున వెస్ట్ బెంగాల్(West Bengal) లో విషాదం చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లాలోని మాల్​బజార్​ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు స్థానికులు అనేక మందికి మాల్​ నదికి వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఓ చిన్న దీవి లాంటి ప్రదేశంలో నిల్చుని విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. మాల్ నదిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేస్తుండగా చూస్తుండగానే కళ్లముందు క్షణాల వ్యవధిలో వరద ఉదృతి పెరిగింది. ఎగువ నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తి దీవిని ముంచెత్తింది.

దీంతో పెద్ద సంఖ్యలో జనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో 8 మంది నీట మునిగి మ‌ర‌ణించ‌గా ప‌లువురు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఈ విషాదం గురించి తెలుసుకున్న సీఎం మమతా బెనర్జి హుటాహుటిన రెస్క్యూ ఫోర్స్‌ను అక్కడికి పంపించి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు, ఎన్​డీఆర్​ఎఫ్,ఎస్‌డిఆర్‌ఎఫ్​ సిబ్బందిని రంగంలోకి దింపారు.

Offshore wind projects : సముద్రతీర భూమిని లీజుకి ఇవ్వడానికి కేంద్రం ప్లాన్స్

వరద ఉద్ధృతి మధ్య దీవిపై అలానే బిక్కుబిక్కుమంటూ నిల్చున్న దాదాపు 50 మందిని రక్షించారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది

Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, West Bengal

ఉత్తమ కథలు