రైలు ఢీకొని 170 గొర్రెలు మృతి... గొర్రెలను కాపాడబోయే కాపరి కూడా...

పశువుల మేత సరిపడనంత దొరకకపోవడంతో గుంటూరు జిల్లాకు వలస...స్వగ్రామానికి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదం... గొర్రెలను కాపాడలేక రైలు పట్టాలపై నిలబడి ప్రాణాలు విడిచిన కాపరి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 4, 2019, 8:31 AM IST
రైలు ఢీకొని 170 గొర్రెలు మృతి... గొర్రెలను కాపాడబోయే కాపరి కూడా...
రైలు ఢీకొని 170 గొర్రెల మృతి... గొర్రెలను కాపాడబోయే కాపరి కూడా...
  • Share this:
గుంటూరు జిల్లా నరసాపురం సమీపంలో గుంటూరు- కర్నూలు హైవే సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద విషాదం జరిగింది. రైలు పట్టాల మీదికి వెళ్లిన గొర్రెల మందను కాపాడబోయిన గొర్రెల కాపరి ప్రాణాలు విడిచాడు. అతనితో పాటు ఏకంగా 170 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని ఉమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 35 ఏళ్ల నాగం తిరుపతయ్య... స్వగ్రామంలో పశువుల మేత సరిపడనంత దొరకకపోవడంతో తమ్ముళ్లు చిన తిరుపతయ్య, శ్రీనివాసరావులతో కలిసి మూడు నెలల క్రితం గుంటూరు జిల్లాకు తరలివచ్చారు. కొన్నాళ్ల క్రిందట గ్రామంలో వర్షాలు పడి, చెట్లు మళ్లీ చిగురించాయని తెలిసి...స్వగ్రామం బయలుదేరారు. గొర్రెలను తీసుకుని దారి గుండా నడుస్తూ వెళుతూ గురువారం జొన్నలగడ్డకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి గొర్రెల మందను తీసుకెళ్లారు. గొర్రెలన్నీ రైలు పట్టాల పైకి చేరిన సమయంలో రైలు దూసుకొచ్చింది. హారన్ చేయకుండా వస్తున్న విజయవాడ-హుబ్లీ ప్యాసింజర్ రైలును చూసిన తిరుపతయ్య... కంగారుగా పట్టాల పైకి వెళ్లి గొర్రెలను నెట్టడం మొదలెట్టారు. అయితే భారీ సంఖ్యలో ఉన్న గొర్రెలు...ఒక్కొక్కటిగా పట్టాల పై నుంచి తప్పించుకునేలోపు రైలు వేగంగా దూసుకొచ్చింది.

దగ్గరికి వచ్చిన తర్వాత రైలు కూత వేయడంతో కంగారు పడిన గొర్రెలు... పట్టాలపైకి పరుగెత్తాయి. గొర్రెలను కాపాడాలనే ఉద్దేశంతో తిరుపతయ్య... పట్టాలపైనే నిలబడ్డాడు. అంతే... అతన్ని బలంగా ఢీకొట్టిన రైలు... పట్టాలపైన ఉన్న 170 గొర్రెలను చంపేస్తూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తిరుపతయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా 170 జీవాలు, గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోవడంతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

First published: May 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>