హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లి వేడుకలో ఘోర విషాదం..పేలిన గ్యాస్ సిలిండర్..ఐదుగురు సజీవదహనం

పెళ్లి వేడుకలో ఘోర విషాదం..పేలిన గ్యాస్ సిలిండర్..ఐదుగురు సజీవదహనం

పెళ్లి వేడుకలో పేలిన గ్యాస్ సిలిండర్

పెళ్లి వేడుకలో పేలిన గ్యాస్ సిలిండర్

రాజస్థాన్ లో ఓ పెళ్లి వేడుకలో ఘోర విషాదం చోటు చేసుకుంది.  రాష్ట్రంలోని జోధ్ పూర్ లో పెళ్లి వేడుకలు జరుగుతుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా 12 మంది పరిస్థితి విషమంగా మారింది. ఇక 50 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Rajasthan

రాజస్థాన్ లో ఓ పెళ్లి వేడుకలో ఘోర విషాదం చోటు చేసుకుంది.  రాష్ట్రంలోని జోధ్ పూర్ లో పెళ్లి వేడుకలు జరుగుతుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా 12 మంది పరిస్థితి విషమంగా మారింది. ఇక 50 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

PM Modi: బీజేపీకి ప్రజల మద్దతు అసాధారణం.. నూతన ఆకాంక్షలకు ప్రతిబింభమన్న ప్రధాని మోదీ

Gujarat Election Result | Himachal Pradesh Election Result: గుజరాత్ , హిమాచల్ ఎన్నికల తుది ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

12 మంది పరిస్థితి విషమం..50 మందికి గాయాలు..

జోధ్ పూర్ లోని భుంగా గ్రామంలో గురువారం ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీనితో భారీగా మంటలు చెలరేగాయి. ఒకేసారి మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. టెంట్ కు మంటలు అంటుకోవడంతో దాని కింద వున్న ఐదుగురు వ్యక్తులు బ్రతికుండగానే మంటల్లో కాలిపోయారు. మరో 12 మంది 70 శాతానికి పైగా గాయాలయ్యాయి. ఇక 50 మందికి స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి మంటలను ఆర్పేశారు. అప్పటివరకు చిరునవ్వులతో ఉన్న ఆ ఇంట ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.

స్పందించిన కలెక్టర్..

ఈ ఘటనపై కలెక్టర్ హిమాన్షు గుప్తా స్పందించారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.

ప్రమాదానికి కారణం ఏంటి?

అయితే గ్యాస్ సిలిండర్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలిసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Crime, Crime news, Crime story, Marriage, Rajastan, Wedding

ఉత్తమ కథలు