హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tragedy : అంతలోనే పెళ్లి.. కానీ విధి ఆడిన వింత నాటకంలో పెళ్లి కూతురు ఇంట విషాదం

Tragedy : అంతలోనే పెళ్లి.. కానీ విధి ఆడిన వింత నాటకంలో పెళ్లి కూతురు ఇంట విషాదం

Fire Breaks ( photo : twitter)

Fire Breaks ( photo : twitter)

Tragedy : విధి వెక్కిరిస్తే జీవితం వింత నాటకంలా మారిపోతుంది. ఆ నాటకంలో ఎవరైనా సమిధులు కావాల్సిందే... ఇదే పరిస్థితి ఆ పెళ్లి కూతురు కుటుంబానికి ఎదురైంది. కాసేపట్లో పెళ్లి జరగనున్న ఆ కుటుంబానికి జరగకూడని నష్టం జరిగింది.

విధి వెక్కిరిస్తే జీవితం వింత నాటకంలా మారిపోతుంది. ఆ నాటకంలో ఎవరైనా సమిధులు కావాల్సిందే... ఇదే పరిస్థితి ఆ పెళ్లి కూతురు కుటుంబానికి ఎదురైంది. కాసేపట్లో పెళ్లి జరగనున్న ఆ కుటుంబానికి జరగకూడని నష్టం జరిగింది. మెహందీ వేడుకల్లో పెళ్లి కూతురు కుటుంబం మునిగి ఉండగా.. సంభవించిన అగ్ని ప్రమాదం వారి రాతనే మార్చింది. పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బులు, పెళ్లి కూతురు ఆభరణాలు ఆ అగ్ని ప్రమాదంలో కాలి దగ్ధమయ్యాయ్. ఇంకేముంది.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువతి నిరాశలో మునిగి.. షాక్ కు గురైంది. దీంతో ఆ పెళ్లి కూతురును ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

ఈ ఘటన చండీఘర్ లో జరిగింది. 26 ఏళ్ల రూపాకి చండీఘర్ కి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ ప్రమాదం జరగకపోయింటే ఈ రోజు సాయంత్రమే వారి వివాహం జరగాల్సి ఉంది. కానీ, దురదృష్టం పెళ్లి కూతురు కుటుంబాన్ని వెంటాడింది. వారు ఉంటున్న మురికివాడలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంకేముంది ఆ మురికివాడలో ఉంటున్న వారి ఇళ్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ మంటల్లోనే పెళ్లి కోసం దాచుకున్న నగదు, ఆభరణాలన్నీ దగ్దమయ్యాయ్. ఈ వార్త వినగానే పెళ్లి కూతురు షాక్ కు గురై స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నష్టాన్ని అధిగమించి..త్వరలోనే మరో ముహుర్తం చూసి పెళ్లికి ఏర్పాట్లు చేయాలని పెళ్లి కూతురు బంధువు ఒకరు తెలిపారు.

tragedy
మంటల్లో కాలిపోయిన ఆభరణాలు (photo : twitter)

"కాలనీ-4 లో ఉన్న కాటన్ షాపులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ మంటలు పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయ్. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. ప్రాణనష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్థి నష్టం సంభవించింది" అని స్థానిక పోలీసులు తెలిపారు.

First published:

Tags: Fire Accident, Marriage, Wedding

ఉత్తమ కథలు