Hyderabad Traffic Police: ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు...కేటుగాళ్ల కొత్త టెక్నిక్...

నిబంధనల అతిక్రమణదారులు కొత్త దారులు వెతుక్కున్నారు. తప్పుచేసినా పోలీసులకు దొరక్కుండా కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. బండి నంబర్ ప్లేట్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 8:24 PM IST
Hyderabad Traffic Police: ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు...కేటుగాళ్ల కొత్త టెక్నిక్...
నెంబర్ ప్లేటును మడతపెట్టిన బైక్ రైడర్
news18-telugu
Updated: August 23, 2019, 8:24 PM IST
మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతున్నా.... ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నా... రాంగ్ రూట్ లో వాహనం నడిపినా... నో ఎంట్రీలోకి వెళ్లినా... సిగ్నల్ జంప్ చేసినా.. ఇలా ఏ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా పోలీసులు చక్కుమని ఫోటో తీస్తున్నారు. లేదంటే సీసీ కెమెరాలో మీ అతిక్రమణ నిక్షిప్తమవుతుంది. చలానా మీ ఇంటికి చేరిపోతుంది. నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా చెల్లించకుంటే ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడితే మీ పెండింగ్ ఛలాన్లన్నీ ముక్కు పిండి వసూలు చేస్తారు. లేదంటే బండి సీజ్ చేస్తారు. ఇలాంటి వాటికి నిబంధనల అతిక్రమణదారులు కొత్త దారులు వెతుక్కున్నారు. తప్పుచేసినా పోలీసులకు దొరక్కుండా కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. బండి నంబర్ ప్లేట్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు.

కొన్నిఅక్షరాలు దాచిపెడుతూ ప్లేట్ ను వంచేస్తున్నారు. దీంతో సీసీ కెమెరాలు, కెమెరాల కంటికి కనిపించకుండా తప్పించుకుంటున్నారు. ఎప్పుడైనా పోలీసులు గుర్తించి పట్టుకుంటే ప్లేట్ మడతపడింది చూసుకోలేదని బుకాయిస్తున్నారు.  అయితే.. హైదరాబాద్ నగరంలో ఇలాంటి కేటుగాళ్ల సంఖ్య ఈ మధ్య విపరీతంగా పెరిగిందని... నిబంధనలు అతిక్రమించడం కోసమే కొందరు ఇలా చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

నెంబర్ కనబడకుండా ప్లేటును మడతపెట్టిన కేటుగాడు..


First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...