Home /News /crime /

constable kidnap :కారు పేపర్లు చూపించమన్న కానిస్టేబుల్‌ను.. ఏకంగా కారులోనే వేసుకుని వెళ్లాడు..

constable kidnap :కారు పేపర్లు చూపించమన్న కానిస్టేబుల్‌ను.. ఏకంగా కారులోనే వేసుకుని వెళ్లాడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Traffic constable kidnap : డ్యూటిలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌నే ఓ సాధారణ పౌరుడు కిడ్నాప్ చేశాడు. అనంతరం తన కారులోనే సుమారు పదికిలోమీటర్లు తిప్పి.. చివరకు ఎవరు లేని చోట వదిలేసి వెళ్లిపోయాడు..

  ఇటివల ట్రాఫిక్ పోలీసులపై ( Traffic Police ) నార్త్ ఇండియాలో దాడులు ఎక్కువయ్యాయి.. ఏకంగా డ్యూటిలో ఉన్న పోలీసులు సిని ఫక్కిలో దాడులు చేయడంతో పాటు అడ్డుకున్న వారిపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సంఘటనలు అయితే సినిమాను తలపించే విధంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల ఢిల్లీలో ( Delhi ) తన కారును ఆపిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌లును ఏకంగా కారుపై కూర్చున్న అలాగే తీసుకుని పోయిన సంఘటన తాజాగా యూపీలో వెలుగు చూసింది.

  ఇప్పుడు తాజాగా అంతకంటే దారుణమైన సంఘటన మరోకటి వెలుగు చూసంది. ఏకంగా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ప్రయాణికుడు కిడ్నాప్ చేశాడు. అదికూడా పది కిలోమీటర్ల మీర తన కారులో కూర్చోపెట్టుకుని అనంతరం ఎవరు లేని చోట వదిలి పెట్టడడం గమనార్హం.

  అచ్చు సినిమాల్లో చూపించే విధాంగానే యూపిలో ( up ) ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కిడ్నాప్ జరిగింది. కారు పేపర్స్ చూపించమన్నందుకు కిడ్నాప్ ( kidnap ) చేశాడు. దీంతో ఆ కిడ్నాపర్ బండారం మొత్తం బయటపడింది. గతంలో తాను చేసిన నేరాల చిట్టాను పోలీసులు బయటకు తీశారు. దీంతో కిడ్నాప్ చేసిన కారు కూడా దొంగిలించింది కావడంతో ఈ కిడ్నాప్‌ డ్రామాకు తెరతీసినట్టు పోలీసులు బావిస్తున్నారు.

  ఇది చదవండి : అక్టోబరు 20 రాశి ఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు.


  వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ( uttarpradesh )గ్రేటర్‌ నొయిడాలో చోటు చేసుకుంది. రెండేళ్ల కిత్రం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ కారు షోరూమ్‌లో మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు కొనేందుకు నిందితుడు సచిన్‌ రావల్‌(29) వెళ్లాడు. టెస్ట్‌ డ్రైవ్‌కి వెళ్లొస్తా అని చెప్పి కారుతో సహా ఉడాయించాడు. అలా గ్రేటర్‌ నొయిడాలోని తన స్వగ్రామం ఘోడీ బచేడాకి చేరుకున్నాడు. కొత్తకారు కొన్నట్లు అందరికీ చెప్పుకున్నాడు. కారుకు ఓ నకిలీ నంబర్‌ ప్లేట్‌ని అమర్చుకున్నాడు. అయితే..రెండు రోజుల క్రితం సుర్జాపుర్‌లో దొంగిలించిన కారులో రావల్‌ వెళుతున్నాడు. వాహన తనిఖీలో భాగంగా భాగంగా రావల్‌ కారును పోలీసులు ఆపారు.

  ఇది చదవండి  : టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా నేడు ఏపీ బంద్


  ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌ సింగ్‌ వచ్చి డ్యాకుమెంట్స్‌ చూపించమని అడిగాడు. పత్రాలు లేవని, కారులో కూర్చుంటే మొబైల్ ఫొన్‌లో ఉన్న సాఫ్ట్‌కాపీ డాక్యుమెంట్స్‌ని చూపిస్తా అని నమ్మబలికాడు. కానిస్టేబుల్‌ కారు ఎక్కిన మరుక్షణం వెంటనే కారు లాక్‌ వేసేసి ముందుకు పోనిచ్చాడు. అలా 10 కి.మీ దాటాక ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ను రోడ్డు మీద వదిలేసి పారిపోయాడు. సోమవారం సుర్జాపుర్‌ పోలీసుస్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి నిందితుడిని అరెస్టు చేశారు. దొంగలించిన కారుని స్వాధీనం చేసుకున్నారు.

  కాగా ఇటివల ఢిల్లీలో కారు పేపర్స్ చూపించమని ఓ కానిస్టేబుల్‌ కారును అడ్డుకున్నాడు. అయితే ఆ కారు యజమాని అందుకు నిరాకరించడంతో పేపర్స్ చూపించే వరకు కారును కదలనిచ్చేది లేదని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మొండికేయడంతో కారు యజమాని కూడా అంతే మొండిగా వ్యవహరించాడు. కారు బానట్ మీద కూర్చున్న కానిస్టేబుల్‌తో సహా ముందుకు పోనిచ్చాడు. దీంతో బానట్‌పై కూర్చున్న కానిస్టేబుల్ కూడా అలాగే వెళ్లాడు. దీంతో ఆ సంఘటన వైరల్‌గా మారిన విషయం తెలిసిందే..
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Noida

  తదుపరి వార్తలు