విషాదం.. ఆర్ఎస్ఐ భార్య ఆత్మహత్య.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం..

నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్‌ ఫస్ట్ లేడీ మేయర్ వీధిలో ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ మురళి(45) నివాసం ఉంటున్నాడు.

news18-telugu
Updated: July 3, 2020, 11:11 AM IST
విషాదం.. ఆర్ఎస్ఐ భార్య ఆత్మహత్య.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒక ఘటనలో రిజర్వు ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకోగా, మరో ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలు బుధవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ రిజర్వు ఎస్ఐ భార్య పిరుబాయీ(45) పగటి సమయంలో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గురువారం ఉదయం గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ మేరకు స్థానిక రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు.

అయితే ఈమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మరో ఘటనలో నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్‌ ఫస్ట్ లేడీ మేయర్ వీధిలో ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ మురళి(45) నివాసం ఉంటున్నాడు. అతడు బుధవారం రాత్రి తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మురళి చనిపోయాడు.

అయితే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో గుండెపోటుతో చనిపోయారంటూ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ వైద్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ వైద్యులు అందుకు నిరాకరించి పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మురళి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
First published: July 3, 2020, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading