Road Accident : ఓ ట్రాక్టర్-ట్రాలీ ట్రక్కును ఢీకొట్టింది. . ఢీకొనడంతో ట్రాక్టర్ ట్రాలీ రెండు భాగాలుగా పోయింది. జేసీబీ యంత్రం సాయంతో డ్రైవర్ను ట్రాక్టర్ ట్రాలీ నుంచి దింపాల్సి వచ్చింది.
ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్ గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో మంగళవారం ఓ ట్రాక్టర్-ట్రాలీ ట్రక్కును ఢీకొట్టింది. గరియాబంద్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోబా సమీపంలో ట్రక్కు - ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. మజర్ కట్టాకు చెందిన బాధితులందరూ మొహ్లాయ్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మృతుల కుటుంబాలకు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు మరియు గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
గరియాబంద్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ విశ్వదీప్ యాదవ్ మాట్లాడుతూ.."ట్రాక్టర్-ట్రాలీ మలుపు తీసుకుంటుండగా ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొనడంతో ట్రాక్టర్ ట్రాలీ రెండు భాగాలుగా పోయింది. జేసీబీ యంత్రం సాయంతో డ్రైవర్ను ట్రాక్టర్ ట్రాలీ నుంచి దింపాల్సి వచ్చింది"అని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.