చిత్తూరు జిల్లాలో పోలీస్ స్టేషన్ నుంచి సంకెళ్లతో సహా దొంగ పరార్

ఈ రోజు తెల్లవారుజామున తిరుచానూరు పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో సంకెళ్ళతో పరారీ అయ్యాడు.

news18-telugu
Updated: January 19, 2020, 8:49 PM IST
చిత్తూరు జిల్లాలో పోలీస్ స్టేషన్ నుంచి సంకెళ్లతో సహా దొంగ పరార్
పారిపోయిన దొంగ (File)
  • Share this:
ఓ ట్రాక్టర్ దొంగతనం కేసులో అరెస్టయిన దొంగ పోలీస్ స్టేషన్ నుంచి సంకెళ్లతో సహా పరారయ్యాడు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం సంకెళ్ళతో ఉన్న ఖైదీ ఉన్నఫలంగా ఒక్కసారిగా పరుగులు పెట్టాడు. బాత్ రూమ్ అని వెళ్లి వెనుక మార్గంలో ఉడాయించాడు. ఇతను ట్రాక్టర్ దొంగతనం కేసులో నిందితుడు. స్వర్ణముఖి టవర్స్ లో నివాసం ఉంటున్న ట్రాక్టర్ యజమాని దగ్గర వెంకటేష్ పని చేస్తున్నాడు. గత నెలలో ట్రాక్టర్ తో పాటు ఉడాయించాడు. అతను అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గర అమ్ముతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ యజమానికి ఫోన్ చేశారు. ట్రాక్టర్ యజమాని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. యజమాని ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుచానూరు పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో సంకెళ్ళతో పరారీ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు