Home /News /crime /

TPCC PRESIDENT REVANTH REDDY SAYS POLICE HIDING FACTS IN JUBILEE HILLS RAPE CASE AK

Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వాటిపై దాడులు చేయాలని పిలుపు

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన విషయంలో పోలీసులు నిజాలు దాస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

    రాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లపై కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్(Hyderabad) బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమవుతోందని.. అందుకే తాము ఈ రకమైన పిలుపు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన(Rape Case) విషయంలో పోలీసులు నిజాలు దాస్తున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలని.. సీవీ ఆనంద్‌ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారని అన్నారు.

    బెంజ్‌ కారు యజమాని ఎవరో ఎందుకు చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీవీ ఆనంద్‌ చెప్పలేదని అన్నారు. ప్రభుత్వ వాహనం అని స్టిక‍్కర్లు తొలగించింది ఎవరని ప్రశ్నించారు. అసలు ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అన్నారు.



    నిందితులు ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నాలను ఎందుకు చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరన్నది సీవీ ఆనంద్‌ చెప్పడం లేదని ఆరోపించారు. మైనర్‌ను లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదని.. అసలు ఇన్నోవా కారులో బాలికను ఎవరు తీసుకెళ్లారని అన్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత అని.. అలాంటప్పుడు కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారని నిలదీశారు.

    Political Leader: ఈటెల మౌనం వెనుక కారణం ఏంటి..? మాజీ మంత్రికి బీజేపీలో ప్రాధాన్యం దక్కడం లేదా..?

    Hyderabad Gang Rape:ఎమ్మెల్యే రఘునందన్ పై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు

    TRS, MIMకు చెందిన నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు మిత్రపక్షాలని.. రేప్, హత్యల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు కొనసాగుతున్నాయని ఈ ఘటన రుజువు చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎక్సైజ్ నిబంధనల మేరకు పబ్ లోకి మైనర్లను అనుమతించొద్దన్నారు. కానీ మైనర్లను పబ్ లోకి అనుమతించిన వారిపై పబ్ యజమానులపై ఎందుకు కేసులు పెట్టలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 150 పబ్‌లకు అనుమతి ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. హైద్రాబాద్ లో గ్యాంగ్ రేప్‌లకు పబ్‌లు, డ్రగ్స్, గంజాయిలే కారణమని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిర్వహించే పబ్ బ్రోతలు హౌస్‌గా మారిందని విమర్శించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Rape case, Revanth Reddy, Telangana

    తదుపరి వార్తలు