హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tourist Vehicle : లోయలో పడ్డ టూరిస్ట్ వాహనం..ఏడుగురు మృతి,10మందికి తీవ్ర గాయాలు

Tourist Vehicle : లోయలో పడ్డ టూరిస్ట్ వాహనం..ఏడుగురు మృతి,10మందికి తీవ్ర గాయాలు

లోయలో పడిన టెంపో ట్రావెలర్

లోయలో పడిన టెంపో ట్రావెలర్

పర్యాటకులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్(Tempo Traveller) లోయలో పడి ఏడుగురు మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Tourist vehicle rolls down gorge : హిమాచల్ ప్రదేశ్‌(Himachal pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో కులు జిల్లాలో బంజార్ సబ్‌డివిజన్‌లోని ఘియాఘి సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్(Tempo Traveller) లోయలో పడి ఏడుగురు మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బంజార్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ శౌరీ సోమవారం ఉదయం 12.45 గంటలకు ప్రమాదం గురించి ప్రజలకు తెలియజేస్తూ ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియోను ప్రసారం చేశారు. క్షతగాత్రులను మొదట బంజార్ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించిన తర్వాత వారిని కులు ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

బాధితులు రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , హర్యానా , ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల వాసులని బంజర్ ఎమ్మెల్యే తెలిపారు. వారిని గుర్తిస్తున్నామని తెలిపారు. చీకటిగా ఉన్నప్పటికీ సహాయక చర్యలు చేపట్టినందుకు జిల్లా యంత్రాంగం,స్థానికులకు శౌరి కృతజ్ఞతలు తెలిపారు. కాగా,ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ అతవేగమే ప్రమాదానికి కారణమా లేక మరేదైనా ఉందా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.

TMC : పీకే స్కెచ్..దీదీకి బిగ్ లాస్..ఫలితం జీరో

దాదాపు వారం రోజుల క్రితం జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి పడిపోయిన ఘటనలో ఏడుగురు చనిపోయారు.గిరిదిహ్ జిల్లా నుంచి రాంచీ వెళ్తున్న బస్సు వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సివాన్నే నదిలో ఎండిపోయిన ప్రదేశంలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ రతన్ చోతే తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రగాయాలతో ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. పలువురు ప్రయాణికులు బస్సులో చిక్కుకోవడంతో వారిని రక్షించి హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ప్రయాణీకురాలు మమతా సలూజా మాట్లాడుతూ...రాంచీలోని రాటు ప్రాంతంలోని గురుద్వారాకు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి బస్సులో సిక్కు యాత్రికులు ఎక్కి ఉన్నట్లు తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Himachal Pradesh

ఉత్తమ కథలు