హోమ్ /వార్తలు /క్రైమ్ /

Plane Crash : కుప్పకూలిన పర్యాటక విమానం..టూరిస్టులు మృతి

Plane Crash : కుప్పకూలిన పర్యాటక విమానం..టూరిస్టులు మృతి

విమానం(ప్రతీకాత్మక చిత్రం)

విమానం(ప్రతీకాత్మక చిత్రం)

Tourist Plane Crash : పర్యాటకులను తీసుకెళ్తోన్న ఓ విమానం కుప్పకూలింది. నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తేందుకు ఏరో శాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన ది సిసన్నా 2017 అనే సింగిల్ ఇంజిన్ విమానం..

Tourist Plane Crash : పర్యాటకులను తీసుకెళ్తోన్న ఓ విమానం కుప్పకూలింది. పర్యటక ప్రాంతానికి సందర్శకులను తీసుకెళ్తుండగా విమానం కుప్పకూలి ఏడుగురు చనిపోయారు. పెరూ దేశంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది.

పెరువియన్​ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తేందుకు ఏరో శాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన ది సిసన్నా 2017 అనే సింగిల్ ఇంజిన్ విమానం(తేలికపాటి విమానం) శుక్రవారం సాయంత్రం పెరూలోని నాజ్కాలోని చిన్న ఎయిర్ పోర్ట్ "మరియా రైచీ"నుంచి టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికి నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో విమానం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో ఐదురుగురు పర్యటకులు, ఫైలట్​, కోఫైలట్​ ఉండగా..మొత్తం ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు.

ALSO READ Hizab Row : ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తో వస్తే,మేం కాషాయ శాలువాలతో వస్తాం!

కాగా,నాజ్కా లైన్లు ప్రపంచ ప్రసిద్ధ పర్యటక ప్రాంతం. లిమాకు దక్షిణంగా 220 మైళ్ళు (350 కిలోమీటర్లు)1500-2000 సంవత్సరాల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన ఊహాత్మక బొమ్మలు, జీవులు, మొక్కల చిత్రాలే నాజ్కా లైన్లు. దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యూనెస్కో గుర్తించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన నాజ్కా లైన్లను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. పర్యాటలకును నాజ్కా లైన్ల దగ్గరకు పర్యాటకులను తీసుకెళ్లేందుకు మరియా రైచీ ఎయిర్‌ఫీల్డ్ నుండి డజన్ల కొద్దీ విమాన సర్వీసులు నడుస్తుంటాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Died, Plane Crash, Tourist place

ఉత్తమ కథలు