Russian top scientist murderd : రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని కరోనా గజగజ వణికించింది. కరోనా మహమ్మారి విలయానికి ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లిపోయాయి. చైనాలోని వుహాన్ నగరంలో బయటపడ్డ ఈ వైరస్ స్వల్ప వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు పాకి సమస్త మానవాళిని గడగడలాడించింది. కోట్ల మంది ప్రజలు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కూడా లక్షల సంఖ్యలో ప్రజలు ఈ మహమ్మారి బారినపడి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని కరోనా గజగజ వణికించిన సమయంలో రష్యా దేశం "స్పుత్నిక్ వీ" పేరుతో కరోనా వైరస్ పై మొట్టమొదటి వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ "స్పుత్నిక్ వి" తయారీలో కీలక పాత్ర పోషించిన ఆండ్రీ బొటికోవ్ దారుణ హత్యకు గురయ్యారు.
గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేసిన బోటికోవ్ (47) గురువారం మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవుడిగా ఉన్న స్థితిలో గుర్తించారు. ఓ బెల్టుతో ఆయన మెడకు ఉచ్చు బిగించి అంతమొందించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న 29 ఏళ్ళ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొటికోవ్ డెడ్ బాడీని గుర్తించిన గంటల వ్యవధిలోనే అనుమానితడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటెరాగేషన్ సమయంలో హత్య తానే చేసినట్లు ఆ యువకుడు అంగీకరించాడని ఫెడరల్ ఏజెన్సీ పోలీసులు తెలిపారు. అతడికి నేర చరిత్ర ఉందని సమాచారం. నిందితుడిని అధికారులు విచారిస్తున్నారు. గత ఏడాది కాలంగా అనుమానాస్పద స్థితిలో పలువురు రష్యన్ ప్రముఖులు, చివరకు వ్యాపారవేత్తలు కూడా మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని రష్యన్ మీడియా పేర్కొంది.
Daughter married father : తండ్రిని పెళ్లాడిన కూతురు..ఇద్దరు పిల్లల్ని కూడా కనింది!
కాగా,2020లో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల్లో బొటికోవ్ ఒకరు. కోవిడ్ వ్యాక్సిన్ ని అభివృద్ధి పరచడంలో తీవ్రంగా శ్రమించిన బోటికోవ్ కు 2021లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతుల మీదుగా "ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ఫర్ ది ఫాదర్ లాండ్ అవార్డ్"ను బొటికోవ్ అందుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Murder, Russia, Scientist, Sputnik-V