తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య తర్వాత ప్రజలు, ముఖ్యంగా మహిళల్లో ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు కొన్ని కాల్ సెంటర్లు, మొబైల్ యాప్స్ తీసుకొచ్చాయి. వాటిని వినియోగించుకుంటే మీకు రక్షణ లభిస్తుంది. ఇది చిన్న విషయమే కదా. ప్రతిదానికి పక్కవారిని అనుమానించకూడదు, ఇదేం పెద్ద విషయం కాదులే నేను చూసుకుంటా. పోలీసులకు ఫోన్ చేస్తే ఏమనుకుంటారో అనే మొహమాటం అస్సలు వద్దు. ప్రస్తుతం చాలా మంది మహిళలు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. అలాంటి వారికి కొన్ని యాప్స్ ఉపయోగపడతాయి.
డయల్ 100. ఇది అందరికీ తెలిసిందే. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు కాల్ వెళ్తుంది.
డయల్ 112. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. భద్రతా పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ఈ నెంబర్‌కు డయల్ చేయవచ్చు.
2019 తర్వాత వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ పవర్ బటన్‌ను మూడుసార్లు వరుసగా నొక్కితే వెంటనే 112 నెంబర్‌కు కాల్ వెళ్లిపోతుంది.
స్మార్ట్‌ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ వాడే వారు.. తమ కీప్యాడ్ మీద 5 లేదా 9 బటన్లని ఎక్కువసేపు నొక్కితే ‘పానిక్ బటన్’ యాక్టివేట్ అవుతుంది. వెంటనే 112 నెంబర్‌కు కాల్ వెళ్తుంది.
డయల్ 181. ఇది మహిళల కోసమే ఉద్దేశించిన ఎమర్జెన్సీ నెంబర్. కేవలం అత్యవసర సమయాల్లోనే కాదు. ఇతరత్రా సమస్యల విషయంలో కూడా ఈ కాల్ సెంటర్ మహిళలకు అండగా నిలుస్తుంది.
HawkEyeSOS. తెలంగాణ పోలీసులు ఈ మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చారు. గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపదలో ఎంతో ఉపయోగపడుతుంది.
ఓలా, ఉబర్ లాంటి క్యాబ్స్ బుక్ చేసుకునే వారికి అందులో సేఫ్టీ బటన్ ఉంటుంది. ఎమర్జెన్సీలో వినియోగించుకోవచ్చు.
ప్రతి జిల్లా పోలీసులు వాట్సాప్ నెంబర్లను వినియోగిస్తున్నారు. ఆ నెంబర్‌ను మీ ఫోన్‌లో తప్పకుండా సేవ్ చేసుకోండి. ఎమర్జెన్సీ సమయాల్లో మీ లొకేషన్ ఆ వాట్సప్ నెంబర్‌కు షేర్ చేస్తే వెంటనే సాయం అందిస్తారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో షీటీమ్స్ ప్రత్యేకంగా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాటిని తప్పకుండా తెలుుకోండి. మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.