భార్యతో కలిసి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ లొంగుబాటు

తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోవడం సంచలనంగా మారింది. అయితే అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారని తెలుస్తోంది.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 9:28 PM IST
భార్యతో కలిసి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ లొంగుబాటు
ప్ర‌తీకాత్మ‌క చిత్రం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 9:28 PM IST
మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సుధాక‌ర్ అలియాస్ కిర‌ణ్ రాంచీ పోలీసులు ముందు లొంగిపోయినట్లు సమాచారం. 2013 నుంచి సుధాక‌ర్ కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నాడు. భార్య మాధ‌వితో పాటు సుధాక‌ర్ లొంగిపోయిన‌ట్లు తెలిసింది. ఝార్ఖండ్ మావోయిస్టు కార్య‌క్ర‌మాల్లో సుధాక‌ర్ క్రియాశీల‌కంగా ఉన్నాడు. సుధాక‌ర్ స్వ‌స్థ‌లం నిర్మ‌ల్ జిల్లా సారంగాపూర్‌. సుధాకర్ పై కోటి రూపాయలు రివార్డు ఉంది.మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో కొంతమంది గత కొంతకాలంగా పోలీసులకు లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోవడం సంచలనంగా మారింది. అయితే అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారని తెలుస్తోంది.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ కు చెందిన సుధాకర్ అలియాస్ కిరణ్ రాష్ట్ర కమిటీ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా అనేక సేవలు అందించారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో సుధాకర్ కీలక పాత్ర పోషించారు. సుధాకర్, భార్య మాధవి 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో సుధాకర్ చురుకుగా పాల్గొన్నాడు. అనేక ఎన్ కౌంటర్లలో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇటు తెలంగాణలో కూడా వారిపై కేసులు ఉన్నాయి. దీంతో వారిని తెలంగాణకు తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. అయితే విచారణ నిమిత్తం వారిని తెలంగాణకు పంపే విషయంలో జార్ఖండ్ పోలీసులు ఏవిధంగా స్పందిస్తారనేది తేలాల్సి ఉంది. అధికారులకు లొంగిపోవడంతో వారిపై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంగళవారం పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...