Home /News /crime /

Shocking: సార్ నేనేం చేశానంటే.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈమె చెప్పింది విని షాకయిన పోలీసులు..

Shocking: సార్ నేనేం చేశానంటే.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈమె చెప్పింది విని షాకయిన పోలీసులు..

సంగీత (ఫైల్ ఫొటో)

సంగీత (ఫైల్ ఫొటో)

వివాహేతర సంబంధాల వ్యామోహం కట్టుకున్న బంధాన్ని కూడా తెంచేస్తోంది. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసి భరోసా కల్పించిన మనిషిని కూడా చంపేందుకు కొందరు వెనకాడటం లేదు.

  భోపాల్: వివాహేతర సంబంధాల వ్యామోహం కట్టుకున్న బంధాన్ని కూడా తెంచేస్తోంది. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసి భరోసా కల్పించిన మనిషిని కూడా చంపేందుకు కొందరు వెనకాడటం లేదు. వేరొకరి మోజులో పడి తన కంటినే తానే పొడుచుకుంటూ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. భోపాల్‌లోని కటరా హిల్స్‌కు చెందిన ధనరాజ్ అనే వ్యక్తి సంగీత అనే మహిళను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

  2014 నుంచి సాగర్ గోల్డెన్ పార్క్‌లోని కటరా హిల్స్‌లో ఉంటున్నారు. ధనరాజ్ పైపుల వ్యాపారం చేస్తుండేవాడు. అతనికి ఒక షాపు ఉంది. భార్య సంగీత గృహిణిగా ఇంట్లోనే ఉండేది. వీళ్ల ఇంటి ఎదురే ఆశిష్ పాండే అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నివాసం ఉండేవాడు. అతనికి కూడ పెళ్లై పిల్లలున్నారు. ఇరుగుపొరుగు వారు కావడంతో రెండు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ధనరాజ్ భార్యపై ఆశిష్ కన్నేశాడు. ఏదో ఒక వంకతో అప్పటి నుంచి ధనరాజ్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.

  Extra Marital Affair, Wife Lover, Husband Murder, Affair, Bhopal
  సంగీత, ఆశిష్, సంగీత భార్య ధనరాజ్


  ధనరాజ్ భార్య కూడా ఆశిష్‌ దారిలోనే నడవడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పలుమార్లు ధనరాజ్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంట్లోనే ఆశిష్, సంగీత రాసలీలలు సాగించేవారు. నెల క్రితం.. ధనరాజ్ ఇంటికొచ్చిన సమయంలో ఇద్దరూ ఇంట్లో కామకేళి సాగిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ధన్‌రాజ్ ఆశిష్‌తో మాట్లాడటం మానేశాడు. భార్యను హెచ్చరించినప్పటికీ ధన్‌రాజ్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. తాను బయటకు వెళ్లగానే మళ్లీ ఇద్దరూ ఎక్కడ కలుసుకుంటారోనన్న అనుమానం మొదలైంది. ఏం చేయాలా అని అతను ఆలోచిస్తున్నాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధాన్ని తెంచేయవచ్చని భావించాడు.

  ఇది కూడా చదవండి: Shocking: రెండేళ్ల కొడుకును బావిలో పడేసిన తల్లి.. ప్రాణం పోయేదాకా అక్కడే నిల్చుని బావిలోకి చూస్తూ..

  ఈ క్రమంలోనే వేరే ఏరియాలో ఇల్లు చూశాడు. గత సోమవారం.. సామాన్లు ప్యాక్ చేయాలని, రేపు ఇల్లు ఖాళీ చేస్తున్నామని ధనరాజ్ చెప్పాడు. వెళ్లిపోతే.. తన ప్రియుడు ఆశిష్‌ను కలవడం మళ్లీ సాధ్యమవదని భావించిన సంగీత తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది.

  Extra Marital Affair, Wife Lover, Husband Murder, Affair, Bhopal
  సంగీత, ఆశిష్


  ప్రియుడికి విషయం చెప్పింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు సంగీత ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం.. 20 నిద్రమాత్రలను ఆశిష్ సంగీతకు తెచ్చి ఇచ్చాడు. కరోనా కావడంతో రోజూ ఇంట్లో కషాయం తాగుతున్నారు. ఆ కషాయంలో ఈ నిద్రమాత్రలు కలిపి ధనరాజ్‌కు ఇవ్వాలని ఆశిష్ సంగీతకు చెప్పాడు. సోమవారం రాత్రి ధనరాజ్ ఆలస్యంగా ఇంటికొచ్చాడు.

  ఇది కూడా చదవండి: Vegetables in Dirty Water: వామ్మో.. ఏంది పెద్దాయన ఇది.. ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా.. ఎక్కడంటే..

  ప్లాన్ ప్రకారం.. సంగీత ఆ కషాయాన్ని తాగమని భర్తకు ఇచ్చింది. అందులో నిద్రమాత్రలు కలిపిన విషయం పసిగట్టలేకపోయిన ధనరాజ్ ఆ కషాయం తాగాడు. కొంతసేపటికే స్పృహ కోల్పోయాడు. సంగీత తన ప్రియుడికి ఫోన్ చేసింది. ఆశిష్ ఆమె ఇంటికి వచ్చి ధనరాజ్ తలను సుత్తితో పలుమార్లు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ధనరాజ్ చనిపోయాడు. ఆశిష్ తన కారులో సంగీతతో కలిసి మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ధనరాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లి బైపాస్ మీదుగా కోలార్ డ్యామ్‌లో పడేశాడు. పోలీసులు ఎలాగైన తనను పట్టుకుంటారని భావించిన నిందితుడు సంగీతతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఆశిష్, సంగీత చెప్పింది విని షాకయ్యారు. ఎందుకు చంపాలనుకున్నావని సంగీతను ప్రశ్నించగా.. ఆమె సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. తన భర్త రోజూ తాగొచ్చి హింసించేవాడని.. ఈ క్రమంలో ఆశిష్ తనను ఓదార్చాడని.. ఆ పరిచయం కాస్తా లవ్ అఫైర్‌కు దారి తీసిందని ఆమె చెప్పింది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Extra marital affair, Husband, Wife

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు