టాలీవుడ్ డ్రగ్స్: ఇక వాటి సంగతి చూస్తామంటున్న అధికారులు

Tollywood Drugs Case: ఇప్పటి వరకూ 7కేసులలో అభియోగ పత్రాలు దాఖలు చేశామని, మిగతా 5 కేసులలోనూ త్వరలోనే దాఖలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

news18-telugu
Updated: May 16, 2019, 11:48 AM IST
టాలీవుడ్ డ్రగ్స్: ఇక వాటి సంగతి చూస్తామంటున్న అధికారులు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 16, 2019, 11:48 AM IST
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసుల సంగతి తేల్చుతామని ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. కేసుల దర్యాప్తులో అధికారులు మితిమీరిన అలసత్వం వహిస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. మిగిలిన కేసులనూ త్వరగా ముగించి అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ 7కేసులలో అభియోగ పత్రాలు దాఖలు చేశామని, మిగతా 5 కేసులలోనూ త్వరలోనే దాఖలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 12 మంది సినీ ప్రముఖులకు దీంతో సంబంధం ఉందని భావిస్తూ ఆబ్కారీ శాఖ అధికారులు వారందర్నీ విచారించారు. కానీ ఇప్పటి వరకు డ్రగ్స్ వ్యవహారం కొలిక్కి రాలేదన్న విషయాన్ని సుపరిపాలన వేదిక వెలుగులోకి తెచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం మొత్తం 12 కేసులు నమోదు చేస్తే నాలుగింటిలోనే అభియోగపత్రాలు దాఖలు చేశారని వెల్లడయింది.

దీనిపై కథనాలు రావడంతో ఆబ్కారీ అధికారులు స్పందించారు. తాము ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని, డ్రగ్స్ సంబంధం ఉన్న వారందరిపైనా అభియోగాలు దాఖలు చేస్తామని తెలిపారు. తెలుగుసినీ పరిశ్రమకు చెందిన వారికి సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదికలు అందాయని, వాటినీ అభియోగపత్రాల్లో పేర్కొంటామని చెబుతున్నారు. కాగా.. సిట్ దాఖలు చేసిన చార్జీషీట్లలో 62 మంది పేర్లు మాత్రం కనిపించడం లేదు. కేసులో 62మంది హీరో హీరోయిన్స్, దర్శకులున్నారు.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...