హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shwetha Kumari: డ్రగ్స్ కేసులో తెలుగు సినీ నటికి 14 రోజుల కస్టడీ.. డొంక లాగుతున్న నార్కోటిక్స్ బృందం

Shwetha Kumari: డ్రగ్స్ కేసులో తెలుగు సినీ నటికి 14 రోజుల కస్టడీ.. డొంక లాగుతున్న నార్కోటిక్స్ బృందం

చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. (ఫ్రతీకాత్మక చిత్రం)

చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. (ఫ్రతీకాత్మక చిత్రం)

పలు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన శ్వేతా కుమారి హైదరాబాద్ నివాసి. అయితే ఆమెకు తెలుగులో కంటే కన్నడలోనే కాస్తో కూస్తో గుర్తింపువచ్చింది. దీంతో సాండల్ వుడ్ లో తనకున్న పరిచయాలతో డ్రగ్స్ మాఫియా లోకి దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన వర్ధమాన తెలుగు సినిమా నటి శ్వేతా కుమారిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు ముంబయి పోలీసులు. శ్వేతా కుమారిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ నెల 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్లో పోలీసులు జరిపిన దాడుల్లో.. ఆమె డ్రగ్ పెడ్లర్లతో సహా అడ్డంగా దొరికిపోయింది. శ్వేతా కుమారిని హోటల్ గదిలోనే విచారించిన పోలీసులు.. దీని వెనక ఉన్న నిందితుల గురించి వివరాలు అడిగారు. అయితే ఈ డ్రగ్స్ కుంభకోణం వెనుక ఎవరెవరున్నారు..? వంటి సమాచారం కోసం ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. శ్వేతా కుమారికి మాఫియా డాన్ కరీం లాలాతో సంబంధాలున్నట్టు సమాచారం. కరీం లాలా పరారీలో ఉండగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

పలు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన శ్వేతా కుమారి హైదరాబాద్ నివాసి. అయితే ఆమెకు తెలుగులో కంటే కన్నడలోనే కాస్తో కూస్తో గుర్తింపువచ్చింది. దీంతో సాండల్ వుడ్ లో తనకున్న పరిచయాలతో డ్రగ్స్ మాఫియా లోకి దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసుకు... కొద్దిరోజుల క్రితం కన్నడ నాట సంచలనంగా మారిన మాదక ద్రవ్యాల కేసుకు ఏమైనా సంబంధం ఉందా...? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా.. డ్రగ్స్ మాఫియా డాన్ కరీం లాలా వ్యాపారంలో కూడా శ్వేతాకు వాటాలున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముంబైలోని మీరా రోడ్డులో ఉన్న ఒక హోటళ్లో డ్రగ్స్ సరఫరాదారులు మహ్మద్ చాంద్ పాషా, సయ్యద్ తో శ్వేతా కుమారి పట్టుబడ్డ విషయం తెలిసిందే. చాంద్ పాషా ది కూడా హైదరాబాదే. అతడి వద్ద నుంచి 400 గ్రాముల డ్రగ్స్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో.. ముంబయిలోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేసిన అధికారులు.. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Drugs, Drugs racket, Kannada Cinema, Sandalwood News, Tollywood, Tollywood drugs case

ఉత్తమ కథలు