కొంత మంది ఇంట్లోకి ముందు చాలా బాగా ఉంటామని చెప్పి అద్దెకు దిగుతారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉంటారు. ఆ తర్వాత.. మెల్లగా అసలు రంగు బయటపెడుతుంటారు. ఫ్రెండ్స్ ను ఇంటికి పిలవడం, తాగడం, పార్టీలు వంటి అడ్డమైన పనులు చేస్తుంటారు. మరికొందరైతే.. ఏకంగా లవర్ లను ఓనర్ కంటపడకుండా ఇంటికి తీసుకొని వస్తుంటారు. ఈ క్రమంలో.. కొందరు అడ్డంగా దొరికిపోతుంటారు. అలాంటి సందర్భాలలో ఓనర్ లకు, అద్దెకు దిగిన వారికి మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు.. హత్యలు చేయడం వరకు వెళ్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే సురేష్ ఇంట్లో బీహర్ కు చెందిన వ్యక్తి.. పంకజ్ కుమార్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితమే అద్దెకు చేరాడు. ఆ తర్వాత.. అతను నిత్యం మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తుండేవాడు. సురేష్ పలుమార్లు హెచ్చరించాడు. అయితే..పంకజ్ మాత్రం తన ప్రవర్తను మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో.. ఆగస్ట్ 9న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన పంకజ్, సురేష్ మధ్య గొడవ జరగడంతో ఈ ఘటన జరిగింది. సురేష్, జగదీష్‌లకు పంకజ్ క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
మరుసటి రోజున ఇద్దరు మరోమారు గొడవ పడ్డారు. సురేష్ కోపంలో.. పంకజ్ ను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత.. పారిపోయాడు. మరుసటిరోజు యజమాని కొడుకు.. తన తండ్రి కోసం ఎంత వెతికిన కన్పించలేదు. దీంతో అతగాడు పైకి వెళ్లి చూడగానే అక్కడ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పుడు అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేవలం 24 గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశాడు. నిందితుడి ఫోన్ ను చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. అతని ఫోన్ లో యజమానిని చంపి, ఆతర్వాత.. సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Crime news, Delhi