నిషేధిత పొగాకు విక్రయాలు జరుపుతున్న వ్యాపారి అరెస్ట్..

యండి వసియోద్దీన్ షేధిత పొగాకు ఉత్పత్తులను తయారు చేయడంతో పోలీసులు కేసును నమోదుచేసి అరెస్ట్ చేసారు

03.5లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం...యంత్రాలు, ముడి పదార్థాలు స్వాధీనం వ్యాపారి అరెస్ట్.

 • Share this:
  జగిత్యాల జిల్లా:  కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారిన వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని నిషేధిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు విక్రయాలు జరుపుతున్న వ్యాపారిని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.
  జగిత్యాల జిల్లా కోరుట్ల లోనిరహమత్ పురా ప్రాంతానికి చెందిన యండి వసియోద్దీన్(39) నిషేధిత పొగాకు ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు.
  ఆదివారంనాడు కరీంనగర్ ఆర్టీసీ వర్కుషాప్ ప్రాంతంలో విక్రయాలు జరిపేందుకు వచ్చాడనే సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.
  విచారణలో తానే ఉత్పత్తులను తయారు చేస్తూ, విక్రయాలు జరుపుతున్నట్లు అంగీకరించాడు. అతడు అందించిన సమాచారం ప్రకారంగా కోరుట్లలోని ఉత్పత్తి కేంద్రం పై దాడి నిర్వహించడం తో పాటు 3.5లక్షల విలువైన వివిధ రకాల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, యంత్రాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
  వెంటనే అతడిపై వివిధ సెక్షన్ల కింద త్రీ టౌన్ పోలీసులు కేసును నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విజ్ఞాన్ రావు తెలిపారు.
  Published by:Venu Gopal
  First published: