TO ESCAPE HARASSMENT TWO INTER COLLEGE GIRLS JUMP OFF MOVING BUS IN GREATER NOIDA SRD
Greater Noida : పోకిరీగాళ్లు చేసిన ఆ పనికి.. రన్నింగ్ బస్సులో నుంచి దూకిన ఇద్దరు యువతులు..
ప్రతీకాత్మక చిత్రం
Greater Noida : అమ్మాయిలు కనిపిస్తే చాలు.. కొందరు వెంట పడి వేధిస్తుంటారు. కాలేజీ అమ్మాయిలైతే ఈవ్ టీజింగ్ కు దిగుతూ ఎంజాయ్ చేస్తారు పోకిరీగాళ్లు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీరి ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది.
అమ్మాయిలు కనిపిస్తే చాలు.. కొందరు వెంట పడి వేధిస్తుంటారు. కాలేజీ అమ్మాయిలైతే ఈవ్ టీజింగ్ కు దిగుతూ ఎంజాయ్ చేస్తారు పోకిరీగాళ్లు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీరి ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. దేశంలో ఎక్కడోకచోట అమ్మాయిలకు వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయ్. పోకిరీగాళ్ల ఎగతాళి మాటలతో భయాందోళనకు గురైన ఇద్దరు ఇంటర్ కాలేజీ విద్యార్ధినులు రన్నింగ్లో ఉన్న బస్సులోనుంచి కిందకు దూకేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాకు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రన్హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్ధినులు సొంత గ్రామానికి వెళ్లటానికి గురువారం పది గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కారు. బస్సు ముందు సీట్లలో యువకులు కూర్చుని ఉండటంతో వారి వెనకాల సీట్లలో యువతులు కూర్చున్నారు. తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్ దగ్గరకు వెళ్లి.. ఊరు రాగానే బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని చెప్పాడు.
దీనికి తోడు ముందు సీట్లలో కూర్చొని ఉన్న ఆకతాయిలు.."ఈ రోజు బస్సు మీ ఊర్లో ఆగదు. ఇక చూడు.. భలే సరదాగా ఉంటుంది" అని అనడం ప్రారంభించారు. దీంతో ఇంటర్ విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. మరోసారి డ్రైవర్ దగ్గరికెళ్లి బస్సు ఆపాల్సిందిగా ప్రాథేయపడ్డారు. కానీ అందుకు ఆ డ్రైవర్ అంగీకరించలేదు. ఆ పోకిరీగాళ్లు ఇంకా రెచ్చిపోయి పెద్ద పెద్ద కేకలు వేశారు. దీంతో ఏమి చేయాలో పాలు పోక రన్నింగ్ బస్సు నుంచి ఒకరి తర్వాత ఒకరు దూకేశారు ఇంటర్ విద్యార్థినులు. ఆ ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయ్. బాధిత యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బస్సు డ్రైవర్, ఆ యువకులపై కేసు నమోదైంది. అయితే డ్రైవర్ ఆ కుటుంబాలతో రాజీపడటంతో గొడవ సద్దుమణిగింది. ఆ ఆకతాయిల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.