పిజ్జాలు కొనుక్కునేందుకు ఇళ్లలో చోరీలు.. 13 ఏళ్ల పిల్లాడి నిర్వాకం

ప్రతీకాత్మక చిత్రం

రోజులు చాలా మారాయి. ఏవి ఎక్కువ తినకూడదో వాటినే ఎక్కువగా తినేందుకు ఆ పిల్లాడు దొంగతనాలు చేస్తున్నాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులే ఆశ్చర్యపోయారు. యూత్ చెడిపోతోందని ఫీలవుతున్నారు.

 • Share this:
  హైదరాబాదీ బిర్యానీ అంటే నచ్చని వాళ్లెవరు... ఆ బీహార్ పిల్లాడికి కూడా బాగా నచ్చింది. వయసు అంతా కలిపి 13 ఏళ్లు. బిర్యానీతోపాటూ... సిటీలో బాగా లభించే పిజ్జాలు, బర్గర్లు రోజూ తినేందుకు అలవాటు పడ్డాడు. అవి కూడా అంతంతమాత్రంవి కావు. చాలా కాస్ట్‌లీవి. మరి అలాంటివి తినాలంటే డబ్బు కావాలి. చాలా డబ్బు కావాలి. అందుకోసం అతను ఎంచుకున్న మార్గం నేరపూరితం. సోమవారం... హయత్ నగర్ దగ్గర రాచకొండ పోలీసులు... ఆ కుర్రాణ్ని పట్టుకున్నారు. ఇప్పటివరకూ ఆ పిల్లాడు 6 ఇళ్లలో చోరీలు చేశాడు. అలాగే నాలుగు ఆస్తి సంబంధిత వస్తువుల్ని ఎత్తుకుపోయారు. అతన్ని పట్టుకున్న పోలీసులు... చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తీసుకెళ్లి... అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచారు.

  నిజానికి ఆ పిల్లాణ్ని ఇదివరకే పోలీసులు పట్టుకున్నారు. 4 చోరీల్లో కేసులున్నాయి. 2021 మార్చిలో... అబ్జర్వేషన్ హోమ్ నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత... హయత్ నగర్ పరిధిలో మరో 6 ఇళ్లలో చోరీలు చేశాడు. దాంతో మళ్లీ పట్టుకోవాల్సి వచ్చింది.

  ఈ పిల్లాడు చదువు మధ్యలోనే ఆపేశాడు. హైదరాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. బిర్యానీ తినడం, పిజ్జాలు, బర్గర్లూ లాగించడం డైలీ రొటీన్. కూలీ డబ్బులు ఓ మూలకి వచ్చేవి కావు. అందువల్ల ఇళ్లలో చోరీ చేయడం, ఆ వస్తువుల్ని బయట అమ్ముకోవడం వంటివి బెటర్ అనుకున్నాడు. మరి ఏ ఇళ్లలో చోరీ చెయ్యాలి అనే దానిపై బాగా ఆలోచించాడు. తాళం వేసి ఉండే ఇళ్లైతే... తాపీగా చోరీ చేసుకోవచ్చు అనుకున్నాడు. మరి తాళాలు ఎలా పగలగొట్టాలి అని ఆలోచించి... ఓ గునపం లాంటి ఇనుప రాడ్డును సంపాదించాడు. దాన్ని తాళం పై భాగంలో గుచ్చి... గట్టిగా కిందకు లాగుతున్నాడు. దాంతో.. తాళం క్షణాల్లో ఊడిపోతోంది. తర్వాత ఇంట్లో విలువైన వస్తువుల్ని పట్టుకుపోతున్నాడు.

  సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతూ... మాటిమాటికీ పోలీసుల వైపు చూస్తుంటే... రాచకొండ పోలీసులకు డౌట్ వచ్చింది. అసలే రాచకొండ పోలీసులు మామూలోళ్లు కాదు. చీమ చిటుక్కు మంటే కనిపెట్టేసే రకం. ఈ పిల్లాడు అలా డౌటుగా తిరుగుతుంటే... "రేయ్ ఇటు రా" అని పిలిచారు. అలా పిలిచినప్పుడు అవతలి వ్యక్తి మంచివాడైతే... ధైర్యంగా వస్తాడు... అదే ఏ తప్పో చేస్తున్నవాడైతే... భయంభయంగా వస్తాడు. అక్కడే ఈ పిల్లాడు భయపడుతూ రావడాన్ని పోలీసులు గుర్తించారు. సంథింగ్ ఏదో చేస్తున్నాడు అని అనుకున్నారు. ఇంతలో పోలీసుల్లో ఒకరు... "సార్ ఈ పిల్లాణ్ని మనం ఆల్రెడీ పట్టుకున్నాం... పాత నేరస్థుడే" అని చెప్పగా... "నాకూ తెలుసు... అందుకే డౌటొచ్చి... పిలిచా" అని ఆ పిల్లాణ్ని పట్టుకెళ్లి... ఎంక్వైరీ చెయ్యగా... చేసిన చోరీలన్నీ వివరంగా చెప్పాడు.

  ఇది కూడా చదవండి: Video: ఒక్క ఆలూ చిప్స్ ముక్కకు రూ.14 లక్షలు ఇచ్చిన కంపెనీ.. ఎందుకంటే.!

  ఇదీ విషయం. మనకున్నదానితో సరిపెట్టుకునేలా జీవితాన్ని మలచుకోవాలి. లేదంటే అన్నీ ఇబ్బందులే. ఇలాంటి నేరాలకు పాల్పడితే... జీవితం జైలుపాలు కాక తప్పదని పోలీసులు అంటున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: