Andhra Pradesh: పెళ్లి చెడగొట్టేందుకు ప్రియుడితో కలిసి నాటకం... యువతి ప్లాన్ మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ విషయం ఇంట్లో చెప్పని ఆ యువతి... మరో యువకుడితో నిశ్చితార్థం చేసుకుంది. ఇంతలోనే ఓ మాస్టర్ ప్లాన్ వేసి అడ్డంగా బుక్కైంది.

  • Share this:
    ఈ రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను ఇంట్లో చెప్పకుండా అడ్డదారులు తొక్కుతున్నారు. తల్లిదండ్రలకు చెప్పే ధర్యం లేక మూర్ఖపు ఆలోచనలతో అడ్డంగా బుక్కవుతున్నారు. ఓ యువతికి నిశ్చితార్థమైంది. కొన్నిరోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఆ యువతి తన కాబోయే భర్తతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వారిపై దాడి చేశాడు. పెప్పర్ స్ప్రే చల్లి ఉంగరం, డబ్బులు తీసుకెళ్లిపోయాడు. దీనిపై యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా సుడుంపల్లికి చెందిన ఎంఈవో కుమారుడు వెంకటసాయి కుమార్ తో రాయచోటికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ క్రమంలో ఈనెల 6న వెంకసాయి కుమార్, యువతి కలిసి బైక్ పై వెళ్తుండగా ఓ వ్యక్తి వారిపై దాడి చేశాడు.

    వెంకటసాయి కుమార్ వద్ద ఉంగరం, డబ్బులు ఎత్తుకెళ్లడమే కాకుండా.. అతడ్ని కొట్టాడు. దీంతో యువతి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తనకు కాబోయే భర్తపై దాడి చేశాడని సుడుంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తనకు కాబోయే అత్తకు, తనకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టేల మాట్లాడుతున్నారని కూడా తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిఘా పెట్టారు. ఫోన్ చేసిన వ్యక్తి పాతరాయచోటిలోని శివాలయం వీధికి చెందిన రెడ్డన్న కుమారుడు మహేష్ గా గుర్తించి అరెస్ట్ చేశారు.

    ఇది చదవండి: చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్, ఫోన్ స్విచ్ఛాఫ్.. సినిమా స్టైల్లో కాపాడిన పోలీసులు



    మహేష్ ను తమదైన శైలిలో విచారించగా అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ కు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతే.. ఈ ఎటాక్ ప్లాన్ వేసినట్లు విచారణలో వెల్లడైంది. మహేష్.. ఆ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో చెడగొట్టేందుకు ప్రియుడితో కలిసి ఈ నాటకం ఆడినట్లు తేల్చారు. దీంతో కేసులో ఆ యువతిని ఏ-2గా కేసు నమోదు చేశారు పోలీసులు.

    ఇది చదవండి: ఏపీకి మళ్లీ వర్షసూచన… ఆ జిల్లాల్లో మాత్రం ఎండల మోతే..


    యువతి ఆడిన నాటకంతో షాక్ తినడం కాబోయే భర్త వంతైంది. అటు యువతి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రేమ విషయం ఇంట్లో చెప్పకుండా నిశ్చితార్థం వరకు వెళ్లిన తమ కుమార్తె.. ఇలాంటి పనిచేస్తుందనుకోలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ వ్యవహారంతో ఇరు కుటుంబాల మధ్య విదాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published: