Home /News /crime /

TIRUPATI SUB JAIL GUN MISS FIRE HEAD CONSTABLE LAKSHMI NARAYANA REDDY KILLED NGS TPT

Andhra pradesh: డ్యూటీ దిగుతుండగా విషాదం... తుపాకీ మిస్ ఫైర్... హెడ్ కానిస్టేబుల్ మృతి

తిరుపతిలో విషాదం గన్ మిస్ ఫైర్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ మరణం

తిరుపతిలో విషాదం గన్ మిస్ ఫైర్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ మరణం

తిరుపతిలో విషాదం నెలకొంది. డ్యూటీ ముగించుకుని కాసేపట్లో ఇంటికి చేరొచ్చనుకున్న హెడ్ కానిస్టేబుల్ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన తుపాకీ మిస్ ఫైర్ అయ్యి ప్రాణాలు తీసింది.

    పోలీసుల రక్షణ కోసం వాడే తుపాకీలే.. వారీ ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో తుపాకీ మిస్ ఫైర్ అయి ఖాకీలు మృతి చెందిన ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నియి. తాజాగా తిరుపతి ప్రత్యేక జైల్లో విషాదం నెలకొంది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యి ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. అయితే ఈ ఘటనపై మొదట పలు అనుమానాలు నెలకొన్నా.. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన మాటలు.. ప్రమాదం జరిగిన ఘటన పరిశీలించిన తరువాత తుపాకీ మిస్ ఫైర్ కారణమంటూ అధికారులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.

    వెస్ట్ సిఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం. తిరుపతిలోని ఏఆర్ బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ 47 ఏళ్ల లక్ష్మి నారాయణ రెడ్డి (హెచ్ సి నెంబర్ 3211) ఏడాది నుండి సబ్ జైలు దగ్గర గార్డుగా పని చేస్తున్నారు. రోజు లాగానే శనివారం కూడా మధ్యాహ్నం ఒంటిగంటకు డ్యూటీ కి వచ్చారు. అయితే సాయంత్రం ఆరు గంటల సమయంలో డ్యూటీ మారేందుకు మరో హెడ్ కానిస్టేబుల్ సిద్ధారెడ్డి జైల్లోని గాడ్ రూమ్ దగ్గరకు చేరుకున్నారు.

    త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆయన వెపన్ పక్కన పెట్టారు. ఆ సమయంలో 303 తుపాకీ మిస్ ఫైర్ అయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆ తుపాకీలో ఐదు రౌండ్ల సరిపోయే మ్యాగజైన్ ఉన్నట్లు తెలిపారు. తుపాకీలోని బుల్లెట్ గుండెళ్లోకి వెళ్లడంతో లక్ష్మీ నారాయణ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలారు. సహచర ఉద్యోగి సిద్ధారెడ్డి జరిగిన విషయాన్ని అందరికీ చెప్పడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ఉన్నాతాధికారులు.

    ఆ వెంటనే ఘటనాస్థలానికి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కూడా వెళ్లారు. మృతదేహాన్ని పరీక్షించి తుపాకీ మిస్ఫైర్ అయి పేలి మృతిచెందినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలులుస్తోంది.

    తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చినా.. అనుమానాలు మాత్రం వీడడం లేదు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపాలని డిమాండ్ చేస్తున్నారు. బట్టలు మార్చుకుంటుండగా గన్ ఎలా మిస్ ఫైర్ అవుతుందని.. అయితే  ఎవరూ టచ్ చేయకుండానే అన్ని బులెట్లు ఎలా పేలాయని.. గుండెళ్లోకి బుల్లెట్ ఎలా వెళ్లిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టు మార్టం తరువాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు అధికారులు..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు