• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TIRUPATI SON ATTEMPTED TO MURDER HIS FATHER WHO MARRIED 9 TIMES AND KILLED 8TH WIFE IN MADANAPALLE OF CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: 9 మంది భార్యలు... 14 మంది పిల్లలు.. ఇంతలో ఆస్తి వివాదం.. కట్ చేస్తే..!

Andhra Pradesh: 9 మంది భార్యలు... 14 మంది పిల్లలు.. ఇంతలో ఆస్తి వివాదం.. కట్ చేస్తే..!

ప్రతీకాత్మక చిత్రం

Tirupati Crime: శవాలను తీసుకెళ్లి ఖననం చేయడం అతడి వృత్తి. అదే వృత్తి చేస్తూ ఏకంగా 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి 14 మంది పిల్లలున్నారు.

  • Share this:
    అతడికి 9 మంది భార్యలు.. దొరికిన పని చేసుకంటూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి ఏకంగా 9 మంది భార్యలున్నారు. వారిలో 8వ భార్యను హత్యచేసి జైలుకెళ్లాడు. అనంతరం ఆస్తి విషయంలో వివాదాలు చోటు చేసకున్నాయి. దీంతో రెండో భార్య కుమారుడు తండ్రిపై హత్యాయత్నం చేశాడు. చావుబతుకుల మధ్య ఉన్న అతడ్ని మరో భార్య కుమారుడు రక్షించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన కుందాని భాస్కర్.. అలియాస్ శవాల భాస్కర్ స్థానికంగా ఎవరైనా చనిపోతే మృతదేహాలకు ఖననం చేయడం వంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి మొత్తం 9 మంది భార్యలు.. తొలుత ఒకరిని పెళ్లిచేసుకోవడం కొంతకాలం తర్వాత వారిని వదిలేసి మరో పెళ్లి చేసుకోవడం ఇలా ఏకంగా 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి మొత్తం 14 మంది పిల్లలు ఉన్నారు. ఈక్రమంలో ఎనిమదవ భార్య ఉషారాణిని 12 ఏళ్ల క్రితం హత్య చేసిన భాస్కర్.. జైలుకు వెళ్లాడు.

    ఆ తర్వాత కొంతకాలానికి బయటకు వచ్చి ఆదెమ్మ అనే మరో మహిళను 9వ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆదెమ్మ వద్దే ఉంటున్నాడు. అక్కడే ఉంటూ గుజిరీ సేకరించి వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. ఐతే 14 మంది కన్నబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. ఈనేపథ్యంలో రెండో భార్య ప్రభావతి కుమారుడు దినేష్.. మదనపల్లెలోని చలపతిరావు కాలనీలో తండ్రి పేరిటన ఉన్న 8 సెంట్ల స్థలంలో తనకు కూడా భాగం పంచాలని ఒత్తిడి చేశాడు. తరచూ ఫోన్ చేసి ఆస్తిలో వాటా అడుగుతుండటంతో త్వరలోనే మదనపల్లె వచ్చి మాట్లాడతానని చెప్పేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పట్టణానికి వచ్చిన భాస్కర్.. తన పాత ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. దీనిని గమనించిన దినేష్.. తన ఫ్రెండ్స్ తో వెళ్లి ఆస్తి పంపకాలపై నిలదేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆస్తిని ఇచ్చేందుకు ఒప్పుకునేది లేదని భాస్కర్ తెగేసి చెప్పాడు.

    దీంతో ఆగ్రహించిన దినేష్ తండ్రిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు.  అతడు స్పృహతప్పి పడిపోవడంతో చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయాడు. కొంతసేపటికి తేరుకున్న భాస్కర్.. సమీపంలోని రామ్ నగర్లో ఉన్న మరో భార్య కొడుకు వద్దకు వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు. భాస్కర్ ను వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు.. భాస్కర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  హత్యకు యత్నించిన దినేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు