• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TIRUPATI POLICE SAVED SOFTWARE ENGINEER IN LAST MINUTE WHO POSTED ABOUT HIS SUICIDE NEWS ON SOCIAL MEDIA FULL DETAILS HERE PRN

AP News: చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్, ఫోన్ స్విచ్ఛాఫ్.. సినిమా స్టైల్లో కాపాడిన పోలీసులు

AP News: చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్, ఫోన్ స్విచ్ఛాఫ్.. సినిమా స్టైల్లో కాపాడిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

తాను చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన సోదరుడు వెంకటరమణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • Share this:
    ఆతడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అతని భార్యది కూడా సాఫ్ట్ వేర్ జాబ్. పైగా ఇద్దరూ ఒకే కంపెనీలో వర్క్ చేసన్నారు. ఏమైందో ఏమో ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. గొడవలు పోలీస్ కేసుల వరకు వెళ్లాయి. ఇంతలో భర్త ఆత్మహత్యయత్నం చేశాడు. తాను చచ్చిపోతున్నానని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు టెక్నాలజీ సాయంతో అతడ్ని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా రైల్వే కోడూకురు చెందిన లింగేశ్వర్ యాదవ్.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడకి 11 ఏళ్ల క్రితం తిరుపతికి చెందిన హిళతో వివాగం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో భార్య.. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులో వారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఐతే ఇద్దరి మధ్య రాజీకుదుర్చేందుకు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిలా లాభం లేకపోయింది.

    ఈ క్రమంలో భార్య తిరుపతిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 10న తన బంధువులతో కలిసి భర్త ఇంటికి వచ్చిన భార్య.. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారం తీసుకెళ్లిపోయింది. ఈ విషయంపై భార్యను నిలదీసేందుకు లింగేశ్వర్ యాదవ్.. ఈ నెల 17న తిరుపతి వెళ్లాడు. ఐతే అక్కడ ఏం జరిగందో ఏమోగానీ.. సోమవారం ఉదయం తాను చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన సోదరుడు వెంకటరమణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కానిస్టేబుల్ ను తిరుపతికి పంపి భార్యతో పాటు ఆమె బంధువుల ఇళ్లలో గాలించారు. అయినా అక్కడ లేడు. ఆలోపు లింగేశ్వర్ ఫోన్ ను ట్యాప్ చేశారు. ఐతే ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారు. వారు లొకేష్ చూసి చివరగా నెల్లూరు జిల్లా రాపూరులో ఫోన్ పనిచేసినట్లు గుర్తించారు. అక్కడ ఆయనకు బంధువులుండటంతో వారిని ఆరా తీశారు. ఐతే అక్కడకు రాలేదని చెప్పడంతో.. సమీపంలోని లాడ్జిల్లో గాలించారు. దీంతో ఓ లాడ్జీలో లింగేశ్వర్ యాదప్ నిద్రమాత్రలు తీసుకొని అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించారు. వెంటనే అతడ్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రధమ చికిత్స అంనతం తిరుపతిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లింగేశ్వర్ యాదవ్ కు ప్రమాదం తప్పిందని.. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published: