హోమ్ /వార్తలు /క్రైమ్ /

TTD: టీటీడీలో మళ్లీ తెరపైకి వచ్చిన భారీ కుంభకోణం.. అసలు దొంగలు ఎవరు..?

TTD: టీటీడీలో మళ్లీ తెరపైకి వచ్చిన భారీ కుంభకోణం.. అసలు దొంగలు ఎవరు..?

తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు పుల్ స్టాప్ పడడం లేదు. టీటీడీ లో నిత్యం ఏదో వివాదం బయటకు వస్తూనే ఉంది. తాజాగా టికెట్ల గోల్ మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంతకీ ఈ స్కామ్ లో అసలు పాత్రదారులు ఎవరు..?

తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు పుల్ స్టాప్ పడడం లేదు. టీటీడీ లో నిత్యం ఏదో వివాదం బయటకు వస్తూనే ఉంది. తాజాగా టికెట్ల గోల్ మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంతకీ ఈ స్కామ్ లో అసలు పాత్రదారులు ఎవరు..?

తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు పుల్ స్టాప్ పడడం లేదు. టీటీడీ లో నిత్యం ఏదో వివాదం బయటకు వస్తూనే ఉంది. తాజాగా టికెట్ల గోల్ మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంతకీ ఈ స్కామ్ లో అసలు పాత్రదారులు ఎవరు..?

  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని సేవ టిక్కెట్ల గోల్ మాల్ పై టీటీడీ చర్యలకు సిద్ధం అయ్యింది.  టిక్కెట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్న.. ఉద్యోగుల సర్వీసుల నుంచి తొలగించడంతో పాటుగా.. చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది టీటీడీ. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లో కొత్త విధిస్తు... నిర్ణయం తీసుకొంది. దింతో టీటీడీ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఇంకెంతమంది ఉద్యోగులు టిక్కెట్ల స్కాం ఉచ్చులో బిగుసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. కేవలం కింది స్థాయి సిబ్బంది చేతివాటమా.. లేకా దీని వెనుక పెద్దల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. అసలు ఈ టీటీడీ టిక్కెట్ల కుంభకోణం ఏంటి..? ఇందులో ఇంటి దొంగల పాత్ర ఎంత..? బయటకు పొక్కడానికి గల కారణాలేంటి..?

  ఏడుకొండల్లో కొలువైన శ్రీవేంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమల గిరులకు చేరుకుంటున్నారు. శ్రీవారి క్షణకాలం దర్శనం ద్వారా జీవితం ధన్యమై.. తాము తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగుతాయని భావిస్తారు. ప్రస్తుతం సర్వదర్శనం.. నడకమార్గంలో జారీ చేసే దివ్య దర్శనం., ఆన్ లైన్ లో విడుదల చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం. విఐపి బ్రేక్ దర్శనాలపై స్వామి వారిని దర్శించుకుంటున్నారు. బ్రేక్ దర్శనం భక్తులు మినహా మిగిలిన అన్ని దర్శనాల్లో శ్రీవారిని దర్శించుకొనేది కేవలం 20 సెకండ్ల లోపే. శని ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజులో శ్రీవారికి ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. నిత్యం జరిగే పలు సేవల్లో 20 నిమిషాల నుంచి గంట పాటు శ్రీవారి ఎదుట కూర్చునే భాగ్యం దక్కుతుంది.

  ప్రపంచంలోనే ఏ దేవాలయానికి లేని డిమాండ్ తిరుమల వెంకన్న ఆర్జిత సేవకు లభిస్తోంది. గతంలో ఆర్జిత సేవ టిక్కెట్లను ఒక్క నెల ముందే భక్తులకు జారీ చేసేది టీటీడీ. కానీ కాలక్రమేణా టిక్కెట్లకు ఉన్న డిమాండ్ కారణంగా 90 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ ను ప్రవేశ పెట్టింది టీటీడీ. ఈ విధానంలో టీటీడీ ఉద్యోగులు తమ చేతివాటం చూపించారు. టీటీడీ పేరిట వచ్చిన డీడీలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం మొదలెట్టారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆర్జితం విభాగాన్ని కంప్యూటరైజ్డ్ చేసింది. ఆన్లైన్., అడ్వాన్సు బుకింగ్, కరెంట్ బుకింగ్ ద్వారా సేవ టిక్కెట్లను విక్రయించడం మొదలెట్టింధి. భక్తులు స్వయంగా ఆన్ లైన్ అడ్వాన్స్ పద్దతిలో పొందేవారు. 2004 నుంచి అర్జితంలో బల్క్ బుకింగ్ ప్రారంభం అయింది. టిక్కెట్ల జారీలో లొసుగులు సొమ్ము చేసుకోవాలనుకున్న ఇంటి దొంగలు ఒకే వ్యక్తి., ఒకే కుటుంభానికి చెందిన కుటుంబ సభ్యులపై బల్క్ బుకింగ్ ప్రారంభించారు. అత్యంత డిమాండ్ ఉన్న సుప్రభాతం., తోమాల, వస్త్రం..అభిషేఖం., ఉదయాస్తమాన సేవలు కుప్పలు తెప్పలుగా సంపన్నులకు జారీ చేయడం ప్రారంభించారు.

  ఇందులో భాగంగా ఉస్మానాబాద్ కి చెందిన కాటికార్ అనే వ్యక్తికీ 30 వేల సేవ టిక్కెట్లను కేటాయించారంటే బల్క్ బుకింగ్లో ఏ స్థాయిలో గోల్ మాల్ జరిగిందో సుస్పష్టంగా అర్థం అవుతోంది. 2010 లెక్కల ప్రకారం సుప్రభాతం., అర్చన., తోమాల సేవ టిక్కెట్లు 2030 వరకు..... శుక్రవారం శ్రీవారికి నిర్వహించే అభిషేకం 2056., వస్త్రం 2070వరకు బల్క్ గా రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే 2008లో టీటీడీ జారీ చేసిన వస్త్రం టిక్కెట్లకంటే అధికంగా భక్తులు రావడంతో ఆర్జిత సేవ టిక్కెట్ల గోల్మాల్ బయట పడింది. రద్దు చేసిన టిక్కెట్లను వేరొకరికి అధిక ధరలకు విక్రయించడం బయట పడింది. దీనిపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇంటి దొంగల గుట్టు బయట పెట్టారు. ఆర్జితం కార్యాలయంలో పనిచేసే అటెండర్ నుంచి... స్పెషల్ గ్రేడ్ అధికారి వరకు అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. కోట్ల రూపాయల సొమ్ము చేతులు మారినట్లు విచారణలో తేలింది. దింతో ఆరు మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.

  ఉద్యోగుల సస్పెన్షన్ తో  కథ ముగిసింది అనుకుంటే మళ్లీ 2010లో తెరపైకి వచ్చింది. 2010 మే మాసంలో 1500 రూపాయలు విలువ చేసే అర్జిత సేవ టిక్కెట్లను 70 సేవలకు విక్రయించాడు ఓ ఉద్యోగి. దింతో ఆర్జితం కార్యాలయ వ్యవహారం మరో మరు బయటకు వచ్చింది. ఆర్జితం వ్యవహారంపై అప్పటి ఈవో ఐవైఆర్ కృష్ణారావు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టిక్కెట్లకుంభకోణంపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ప్రాధమిక నివేదికను ఈవో కు సమర్పించారు. టిక్కెట్ల బుకింగ్ లో భారీ కుంభకోణం జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన ఈవో... ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి కేసును బదిలీ చేయ్యగా...అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి ఛీఫ్ గా వున్న మాజీ డిజిపి దినేష్ రెడ్డి నేతృత్వంలోని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం టీటీడిలోని రికార్డులను పరిశీలించింది. అర్జితం విభాగంతో పాటు సిఫార్సు ఉత్తరాలతో బల్క్ గా సేవా టిక్కెట్లను పోందిన వారిని విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంచలన నివేదేకను ప్రభుత్వానికి.. టీటీడికి సమర్పించారు.అర్జిత కుంభకోణం కేసులో 2004 నుండి 2010 వరకూ టీటీడి పాలకమండలి సభ్యులుగా పని చేసిన వారితో సహా టీటీడి ఉద్యోగులలో 56 మంది ప్రమేయం వున్నట్లు టీటీడికి నివేదికను ఇచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అందజేసిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య,టీటీడి యాజమాన్యం నిందితుల పై కేసు నమోదు చేయ్యాలని నిర్ణయం తీసుకొని.. ఆ మేరకు తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పటి అలయ డిప్యూటీ ఈవో గోపాలక్రిష్ణ 13 మంది పై ఫిర్యాదు చేశారు.

  టీటీడి పిర్యాదు పై విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న సమయంలో ప్రభుత్వం కేసును సిఐడికి బదిలీ చేసింది.కేసు సిఐడికి బదిలి కావడంతో తిరుమల పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు తిరుమల్లో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం పరిశీలించిన రికార్డులను పరిశీలించి ఇంచూ మించూ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన నివేదికనే ప్రభుత్వానికి...టీటీడికి అందజేశారు.

  టిక్కెట్ల కుంభకోణంలో దర్యప్తు ఆంశాని ప్రక్కన పెట్టిన టీటీడికి ఇంత భారీ కుంభకోణంకి గల కారణాలు అన్వేషించ సాగింది. ఆర్జిత సేవ  టిక్కేట్టు నమోదు చేసుకునేందుకు ఎలాంటి నియమనిభందనలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించింది. టికెట్లు నమోదు చేసుకునే విధి విధానాలలో సాములా మార్పులను అప్పటి ఐటి విభాగం రూపొందించింది. బల్క్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి ఒక్క భక్తుడు ఏడాదికి ఒక్క టిక్కేట్టు మాత్రం పోందడానికి అర్హుడని నిభందనను అమలు చేసింది. అంతకు మించి పొందిన టిక్కేట్లును రద్దు చేసి సామాన్య భక్తులకు లక్కి డిప్ ద్వారా పోందే ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో సామాన్య భక్తులకు స్వామి వారి ఆర్జితసేవా టిక్కెట్లను చూసే భాగ్యం దక్కింది.

  ఈ కేసు అప్పట్లో మరుగున పడిపోయింది. గతేడాది ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఈవో జవహార్ రెడ్డి టీటీడిలో పెండింగ్ లో వున్న కేసుల పై దృష్టి సారిస్తున్నారు. పెండింగ్ కేసులన్ని త్వరగతిన పరిష్కరించాలని సంభంధిత విభాగాధిపతులను ఆదేశించారు. తిరిగి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణం తెర పైకి వచ్చింది. దీని పై శాఖపరమైన విచారణ జిరిపించిన ఈవో ఈ కేసులో ప్రత్యక్షంగా ప్రమేయముండి ప్రస్తుతం ఉద్యోగులుగా కొనసాగుతున్న ఆరుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మల్లి తెరపైకి ఆర్జితం రగడ బయటకు వచ్చింది. ఇందులో ప్రస్తుతం సూపరిటెండ్ల హోదాలో వున్న సూర్యనారాయణరెడ్డి, చోడెం మధుసూధన్,సీనియర్ ఆసిస్టెంట్లు హేమాద్రిరెడ్డి ,బాలకృష్ణ, జూనియర్ ఆసిస్టెంట్ నారాయణరాజు, అటెండర్ శ్రీనివాసులను సర్వీస్ నుంచి తొలగించగా.. అప్పట్లో ఆర్జితంలో ఏఈవోగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోగా కోదండరామ స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న పార్వతి పై చర్యలకు ప్రభుత్వానికి సిఫారస్సు చేశారు టీటీడి ఈవో. ఇక ఈ కేసులో ప్రమేయం వుండి రిటైర్డ్ అయిన పలువురు ఉద్యోగులకు అందుతున్న బెనిఫెట్స్ లో కోతను విధించడంతో పాటు పరోక్షంగా ప్రమేయం వున్న మరో 40మంది ఉద్యోగుల పై కూడా శాఖపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు టీటీడి అధికారులు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala brahmotsavam 2021, Tirumala news, Tirumala Temple, Ttd

  ఉత్తమ కథలు